Indur Ayyappa Pilgrimage | తమిళనాడుకు చేరుకున్న ఇందూరు అయ్యప్పల పాదయాత్ర…

ఇందూరు నుంచి శబరిమల వరకు అక్టోబర్​లో ప్రారంభించిన అయ్యప్ప స్వాముల పాదయాత్ర ఆదివారం తమిళనాడుకు చేరుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Indur Ayyappa Pilgrimage | ఇందూరు(Nizamabad) నుంచి శబరిమల వరకు అక్టోబర్​లో ప్రారంభించిన అయ్యప్ప స్వాముల పాదయాత్ర ఆదివారం తమిళనాడుకు చేరుకుంది. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ స్వాములందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Indur Ayyappa Pilgrimage | ఎలాంటి ఆటంకం లేకుండా..

ఎలాంటి ఆటంకం లేకుండా శబరిమల వరకు విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. ఇందూరు శ్రీధర్మ శాస్త్ర పాదయాత్రను జ్ఞానేశ్వర్ గురుస్వామి నేతృత్వంలో కొనసాగుతుంది. మొత్తం 40 మంది అయ్యప్పస్వాముల బృందం ఇప్పటివరకు సుమారు 850 కిలోమీటర్లు నడిచారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను దాటుకొని తమిళనాడులోకి ప్రవేశించారు. పాదయాత్రలో 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీనారాయణ, 3వ డివిజన్ కార్పొరేటర్ ప్రసూన శ్రీనివాస్ రెడ్డి, ఆర్మూర్ 18 వ వార్డు కౌన్సిలర్ శ్రవణ్ కుమార్, స్వాములు మధు, శ్రీనివాస్, అజయ్, గంగా ప్రసాద్ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: ఎయిర్‌పోర్టులో కన్నీళ్లు పెట్టించిన ఘటన.. తండ్రి కోసం కుమార్తె ఆవేదన.. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *