అక్షరటుడే, వెబ్‌డెస్క్: Breakfast Scheme | ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేస్తామని గతంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే పలు ప్రాంతాల్లో విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు.
కరీంనగర్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందించడానికి సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మించారు. తెలంగాణ ప్రభుత్వం, హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా ఇంప్లిమెంటేషన్ భాగస్వామ్యంతో దీనిని ఏర్పాటు చేశారు. ఈ కిచెన్‌ను బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ప్రారంభించారు. అధునాతన సాంకేతిక టెక్నాలజీ తో రూపొందించిన భారీ కిచెన్ ను పరిశీలించారు.
Breakfast Scheme | యంత్రాల సాయంతో..
ఈ కిచెన్‌లో ఓకే సారి వేలాది మంది విద్యార్థులకు అల్పాహారం తయారు చేయొచ్చు. ఆధునిక యంత్రాలను ఇందులో ఏర్పాటు చేశారు. ఇడ్లీ, దోశ, పూరి,సాంబార్, బోండాలను మిషన్లతో తయారు చేస్తారు. అంతేగాకుండా పాత్రలను కడగడానికి కూడా యంత్రాలు ఉన్నాయి. వీటిని పొన్నం పరిశీలించారు. స్వయంగా పలు టిఫిన్లను తయారు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కలెక్టర్ చిత్రా మిశ్రా, అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్పేయి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Energy Efficiency Summit | పొదుపు చేసే ప్రతి యూనిటే చౌకైన విద్యుత్: భట్టి విక్రమార్క