Dabur Honey Campaign | డాబర్ హనీ కొత్త వాణిజ్య ప్రకటన విడుదల.. నాణ్యత, రోజువారీ వినియోగంపై ఫోకస్..

భారతీయ కుటుంబాల్లో తేనె వినియోగాన్ని, బ్రాండ్ నాణ్యతా ప్రమాణాలను చాటిచెప్పేలా డాబర్ ఇండియా లిమిటెడ్.. 'డాబర్ హనీ' (Dabur Honey) కోసం కొత్త టెలివిజన్ వాణిజ్య ప్రకటన (TVC)ను విడుదల చేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌‌డెస్క్: Dabur Honey Campaign | భారతీయ కుటుంబాల్లో తేనె వినియోగాన్ని, బ్రాండ్ నాణ్యతా ప్రమాణాలను చాటిచెప్పేలా డాబర్ ఇండియా లిమిటెడ్.. ‘డాబర్ హనీ’ (Dabur Honey) కోసం కొత్త టెలివిజన్ వాణిజ్య ప్రకటన (TVC)ను విడుదల చేసింది. 30 సెకన్ల నిడివి ఉన్న ఈ ప్రకటనలో డాబర్ హనీ ప్రత్యేకతను తెలిపే మూడు ముఖ్య అంశాలను ప్రధానంగా చూపించారు. 22 నాణ్యతా ప్రమాణాలపై పరీక్షలు, తేనెటీగల పెంపకందారుల నుంచి ఫ్యాక్టరీ వరకు సరఫరా ప్రక్రియను గుర్తించే విధానం (ట్రేసబిలిటీ), అలాగే అగ్‌మార్క్ (AGMARK) స్పెషల్ గ్రేడ్ ధ్రువీకరణ వివరాలను ఇందులో ప్రస్తావించారు.

Dabur Honey Campaign | తేనె వినియోగం..

వంటగదిలో తేనెను వివిధ రకాలుగా ఎలా ఉపయోగించవచ్చో ఈ ప్రకటనలో ఆవిష్కరించారు. యువతులు, తల్లులు, కుటుంబ సభ్యులు తమ దైనందిన అలవాట్లలో తేనెను ఎలా చేర్చుకున్నారో చూపించారు. ఉదయం గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగడం నుంచి స్మూతీలకు తీపి చేర్చడం, సహజ స్వీటెనర్‌గా వాడటం, కుటుంబ భోజనాల్లో భాగంగా తీసుకోవడం వరకు రోజులోని వివిధ సమయాల్లో, విభిన్న అభిరుచులకు తగినట్లు ఒకే తేనె సీసాను ఎలా వినియోగించవచ్చో వివరించారు. దీని ద్వారా ప్రతి ఇంట్లో తేనె ఒక నిత్యావసరంగా మారిందనే సందేశాన్ని అందించారు.

మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీరామ్ పద్మనాభన్ స్పందన..
ఈ సందర్భంగా డాబర్ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీరామ్ పద్మనాభన్ మాట్లాడుతూ.. నాణ్యత, పారదర్శకత పట్ల నిరంతర నిబద్ధత ద్వారానే వినియోగదారుల నమ్మకాన్ని పొందగలమని తాము విశ్వసిస్తున్నట్లు తెలిపారు. “మీ నమ్మకమే మా తేనెను ప్రత్యేకంగా నిలబెడుతుంది” అనే అర్థం వచ్చే ‘ఆప్కా విశ్వాస్ బనాతా హై హమారే హనీ కో సబ్సే ఖాస్’ కొత్త ప్రచారాన్ని ప్రతిరోజూ డాబర్ హనీని ఎంచుకునే లక్షలాది వినియోగదారులకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. వారి నమ్మకమే అత్యున్నత ప్రమాణాలు పాటించేలా తమకు స్ఫూర్తినిస్తుందని, ప్రతి ప్యాక్‌లోనూ కుటుంబాలు కోరుకునే స్వచ్ఛత, నాణ్యత ఉండేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

Dabur Honey Campaign | బహుళ భాషల్లో ప్రసారం..

ఈ ప్రకటనను గ్లోబ్ ట్రాటర్స్ నిర్మించగా, పూజా ఖేమానీ దర్శకత్వం వహించారు. దేశవ్యాప్తంగా వినియోగదారులకు చేరువయ్యేందుకు హిందీ, బెంగాలీ, ఒడియా, మరాఠీ, తమిళం, కన్నడ, తెలుగు భాషల్లో దీనిని ప్రసారం చేయనున్నారు. ఈ TVCతో పాటు ప్రచారానికి సంబంధించిన ఇతర మెటీరియల్స్‌ను టీవీ, ప్రింట్, డిజిటల్ మాధ్యమాల ద్వారా విడుదల చేస్తున్నారు.

ప్రచారం గురించి బీబీడీఓ ఇండియా ( India) నేషనల్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ మణి మాట్లాడుతూ.. లక్షలాది భారతీయ కుటుంబాలు ప్రతిరోజూ నమ్మకం ఉంచినప్పుడు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుందని అన్నారు. ఉదయం తాగే మొదటి గ్లాసు నీటి నుంచి రాత్రి తీసుకునే చివరి చెంచా తేనె వరకు ఎన్నో రోజువారీ అలవాట్లలో డాబర్ హనీ భాగమైందని, బ్రాండ్‌కు ఉన్న ఈ స్థానాన్ని చూపిస్తూనే ప్రతి సీసా వెనుక ఉన్న నాణ్యత పట్ల నిబద్ధతను ఈ ప్రకటనలో ఆవిష్కరించామని తెలిపారు.

ఇది కూడా చదవండి: Akula Kalpana Appointment | మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా ఆకుల కల్పన

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *