Nomination Rejection | కాంగ్రెస్​ నేతల ఆందోళన.. ఈసీ కార్యాలయం ఎదుట హైడ్రామా

మీనాక్షి నటరాజన్​ నామినేషన్​ తిరస్కరించడంతో కాంగ్రెస్​ నాయకులు ఈసీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Nomination Rejection | కాంగ్రెస్​ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)​ నామినేషన్​ను ఎన్నికల సంఘం తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీలోని ఈసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్​ నేతలు ఆందోళనకు దిగారు.

మీనాక్షి నామినేషన్‌ తిరస్కరణపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన కాంగ్రెస్‌ నేతల బృందం ఈసీ కార్యాలయానికి వెళ్లింది. జైరాంరమేష్‌తో పాటు కాంగ్రెస్‌ నేతలను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో సెక్యూరిటీ సిబ్బందితో జైరాంరమేష్‌ వాగ్వాదం చేశారు. ఈసీ ఆఫీసు ఎదుట బైఠాయించి కాంగ్రెస్​ నేతలు కేసీ వేణుగోపాల్‌, జైరాంరమేష్‌, సచిన్‌ పైలట్‌ తదితరులు ఆందోళన చేపట్టారు.

Nomination Rejection | ఇక్కడే కూర్చుంటాం

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ (KC Venugopal) మాట్లాడుతూ… ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన ప్రాథమిక అంశం అన్నారు. తమను లోపలికి అనుమతించే వరకు ఇక్కడే కూర్చుంటామని స్పష్టం చేశారు. సచిన్​ పైలెట్​ మాట్లాడుతూ.. మీనాక్షి నటరాజన్​పై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ (FIR)లు, ఛార్జ్‌షీట్లు లేన్నారు. కారణం లేకుండానే తమ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించారని మండిపడ్డారు. తాము గెలిచే అవకాశం ఉన్న స్థానానికి సంబంధించిన అభ్యర్థి నామినేషన్ రద్దు అయిందన్నారు.

Nomination Rejection | స్పందించిన మీనాక్షి నటరాజన్​

తన నామినేషన్ తిరస్కరణకు గురి కావడంపై కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ స్పందించారు. సంఖ్యా బలం లేనప్పటికీ అధికారంలో ఉన్న బీజేపీ మూడో అభ్యర్థిని బరిలోకి దించడంతోనే ఇదంతా మొదలైందన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాలరాసేలా వారు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంతో బీజేపీ రాజనీతి ఏంటో అందరికి అర్థమైందన్నారు. దేశంలో ఏక పార్టీ వ్యవస్థను తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

దీనిని కూడా చదవండి :  Meenakshi Natarajan Nomination | రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్​కు​ షాక్​.. మీనాక్షి నటరాజన్​ నామినేషన్​ తిరస్కరణ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *