అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rahul Gandhi Convoy Accident | లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం జరిగింది. ఓ కేసు విచారణ నిమిత్తం ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) వెళ్లిన ఆయన.. కోర్టుకు వెళ్తుండగా సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
తనపై నమోదైన పరువు నష్టం కేసు తీర్పు కోసం యూపీలోని సుల్తాన్‌పూర్‌కు రాహుల్ గాంధీ బయలు దేరారు. ఆయన ఉదయం ఢిల్లీ నుంచి లక్నో ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ నాయకులు, కార్యకర్తలు ప్రతిపక్ష నేతకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన సుల్తాన్పూర్ కోర్టుకు వెళ్తుండగా.. కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి.
Rahul Gandhi Convoy Accident | భద్రతా సిబ్బందికి గాయాలు
కాన్వాయ్‌లోని ఐదు వాహనాలు, అంబులెన్స్ ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కార్యకర్తలు, భద్రతా సిబ్బందికి గాయాలు అయ్యాయి. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో రాహుల్ గాంధీ సురక్షితంగా బయటపడ్డారు.
ఇది కూడా చదవండి..: Judge’s Son Car Accident | స్కూటీని ఢీకొన్న జడ్జి కుమారుడు.. ఒకరి మృతి