Ayodhya Ram Mandir Timings | అయోధ్య రామమందిర దర్శన వేళల్లో మార్పులు.. నవంబర్ 1 నుంచి కొత్త సమయాలు ఇవే..!

దేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన అయోధ్య శ్రీ రామజన్మభూమి మందిరంలో శ్రీరాముడి (రామ్‌లల్లా) దర్శన వేళలను మారుస్తూ ఆలయ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ayodhya Ram Mandir Timings | దేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన అయోధ్య శ్రీ రామజన్మభూమి మందిరంలో శ్రీరాముడి (రామ్‌లల్లా) దర్శన వేళలను మారుస్తూ ఆలయ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఆలయ సమయాలు, ప్రత్యేక హారతులు, భోగ నివేదనలు విశ్రాంతి సమయాల్లో మార్పులు చేసినట్లు శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ఈ కొత్త నిబంధనలు నవంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.

Ayodhya Ram Mandir Timings | ఆలయం తెరిచే సమయం ..

ప్రస్తుతం ఉదయం 3:45 గంటలకే తెరుచుకుంటున్న ఆలయ ద్వారాలను, నవంబర్ 1 నుంచి ఉదయం 4:00 గంటలకు తెరుస్తారు. తలుపులు తెరిచిన అనంతరం ఉదయం 4:30 నుంచి 4:40 గంటల వరకు స్వామివారికి మంగళ హారతి పూజను నిర్వహిస్తారు.

Ayodhya Ram Mandir Timings | ప్రత్యేక పూజల సమయం..

స్వామివారి అభిషేకం, శృంగార తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాల నిమిత్తం ఉదయం 4:40 నుంచి 6:30 గంటల వరకు భక్తులకు తాత్కాలికంగా అనుమతి ఉండదు. ఉదయం 6:30 గంటలకు శృంగార హారతి పూర్తయిన తర్వాత భక్తులకు రామ్‌లల్లా సాధారణ దర్శనాలు ప్రారంభమవుతాయి.

Ayodhya Ram Mandir Timings | ఆలయం మూసివేత..

రాత్రి పూజాది కార్యక్రమాల అనంతరం 9:30 గంటలకు స్వామివారికి శయన హారతి ఇస్తారు. ఆ తర్వాత రాత్రి 10:00 గంటలకే ఆలయ ద్వారాలను పూర్తిగా మూసివేస్తారు. అయోధ్య  ( Ayodhya )పర్యటనకు వచ్చే భక్తులు ఈ కొత్త సమయాలను గమనించి, దానికి అనుగుణంగా తమ దర్శన ఏర్పాట్లు చేసుకోవాలని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సూచించింది.

ఇది కూడా చదవండి:  Rahul Gandhi Convoy Accident | రాహుల్‌ గాంధీ కాన్వాయ్‌కి ప్రమాదం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *