Kakatiya Main Canal | కాకతీయ ప్రధాన కాలువకు నీటి విడుదల ప్రారంభం

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ ప్రధాన కాలువ (ఎల్‌ఎండీ ఎగువ ప్రాంతం) ఆయకట్టు కోసం అధికారులు నీటిని విడుదల చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, పోచంపాడ్: Kakatiya Main Canal | శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (Sriramsagar Project) కాకతీయ ప్రధాన కాలువ (ఎల్‌ఎండీ ఎగువ ప్రాంతం) ఆయకట్టు కోసం అధికారులు నీటిని విడుదల చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటి విడుదల చేపట్టినట్లు ఇరిగేషన్ సర్కిల్ పోచంపాడ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ వి. జగదీష్ తెలిపారు.

Kakatiya Main Canal | 2000 క్యూసెక్కుల నీరు..

శనివారం ఉదయం 9 గంటలకు 2,000 క్యూసెక్కుల సాగునీటిని అధికారులు విడుదల చేశారు. అనంతరం నీటి విడుదలను క్రమంగా పెంచనున్నట్లు వెల్లడించారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో తగినంత నీటి నిల్వలు లేనందున, విడుదల చేసిన సాగునీటిని రైతులు సక్రమంగా, పొదుపుగా వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి..: RTC Union Elections | ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈయూ, టీఎంయూ కూటమి ప్రభంజనం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *