Caste Census Verdict| కులగణనకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:Caste Census Verdict| దేశంలో కులగణన (Caste Census) నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు బుధవారం ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది. జనగణనతో పాటే కులాల లెక్కింపును కూడా చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం పచ్చజెండా ఊపింది. కులగణన ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లన్నింటినీ విచారించిన కోర్టు, వాటిని పూర్తిగా కొట్టివేస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. ఈ చారిత్రక తీర్పుతో దేశవ్యాప్తంగా కులాల వారీగా జనాభాను లెక్కించేందుకు ఉన్న అన్ని రకాల చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయాయి.

Caste Census Verdict|సుప్రీంకోర్టు స్పష్టీకరణ..

ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. కులగణన అనేది పూర్తిగా ప్రభుత్వ విధానాలకు సంబంధించిన అంశమని, ఇలాంటి పరిపాలనాపరమైన నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని ధర్మాసనం స్పష్టం చేసింది. సమాజంలో వెనుకబడిన వర్గాల ఖచ్చితమైన జనాభా వివరాలు, వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులు ప్రభుత్వాల దగ్గర ఉన్నప్పుడే.. నిజమైన అభివృద్ధి , సమన్యాయం సాధ్యమవుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది.

Caste Census Verdict|సంక్షేమ పథకాలు అసలైన లబ్ధి కోసమే..

సమాజంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అందాలన్నా, వాటిని మరింత సమర్థవంతంగా అమలు చేయాలన్నా కులాల వారీ గణాంకాలు ఎంతగానో ఉపయోగపడతాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో ఈ ప్రక్రియ ఎంతో అవసరమని కోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తాజా తీర్పుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా కులగణన ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు మార్గం సుగమమైంది.

ఇది కూడా చదవండి : Siddipet Incvident | సిద్దిపేటలో షాకింగ్ ఘటన.. బీర్ బాటిల్‌లో కండోమ్ ప్యాకెట్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *