అక్షరటుడే, వెబ్‌డెస్క్: Theni Prison Escape | తమిళనాడు (Tamil Nadu)లోని తేని జిల్లాలో గల జైలు నుంచి ఇటీవల ఖైదీలు పారిపోయిన విషయం తెలిసిందే. కారాగరం గోడలు బద్దలు కొట్టుకొని 17 మంది తప్పించుకున్నారు. ఈ ఘటనతో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తప్పించుకున్న ఖైదీలను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ డిప్యూటీ జైలు సూపరింటెండెంట్‌ను సీఎం విజయ్ శనివారం సస్పెండ్ చేశారు. అక్టోబర్ 26న ఖైదీలు తప్పించుకున్న ఘటనకు దారితీసిన భద్రతా లోపాల విషయంలో, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు తెక్కంపట్టి సబ్-జైలు ఇన్చార్జి డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ ఎన్. రామలింగంను సస్పెండ్ చేశారు. మిగతా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Theni Prison Escape | బదిలీలకు ఆదేశం
తేని జిల్లాలో జరిగిన జైలు బద్దలు కొట్టిన ఘటనపై స్పందిస్తూ, విధి నిర్వహణలో నిర్లక్ష్యం, భద్రతా లోపాలపై జైలు అధికారులపై ముఖ్యమంత్రి క్రమశిక్షణా చర్యలకు ఆదేశించారు. ఈ ఘటనలో 17 మంది ఖైదీలు నకిలీ వైద్య అత్యవసర పరిస్థితిని సృష్టించి, జైలు గార్డులను లొంగదీసుకుని తప్పించుకున్నారు. దీంతో డిప్యూటీ జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత జైలు పరిపాలనాధికారులను బదిలీ చేయాలని సీఎం ఆదేశించారు.
ఇది కూడా చదవండి..: Jahangirpuri LPG Blast | మద్యం మత్తులో దారుణం.. సొంత ఇంటికే నిప్పు..