అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Yelahanka Palace | ఆంధ్ర రాజకీయాల్లో కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన యలహంక ప్యాలెస్‌పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాపర్టీ తనదేనని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
వైఎస్ కుటుంబానికి చెందిన యలహంక ప్యాలెస్‌పై కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ ప్యాలెస్‌లో తన కూతురు పెళ్లి చేయాలని వైఎస్ షర్శిల భావించగా.. జగన్ అందుకు ఒప్పుకోలేదు. అన్నా చెల్లెళ్ల మధ్య ఉన్న వివాదం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈక్రమంలో శనివారం షర్మిల్ ఎక్స్ వేదికగా స్పందించారు. తనది కాని దానికోసం ఆశపడే నీచత్వం తనది కాదన్నారు.
Yelahanka Palace | నాకే వచ్చింది
జగన్ ముఖ్యమంత్రి కాకముందు యలహంక ప్యాలెస్ ఉమ్మడి ఆస్తిగా ఉందని షర్మిల అన్నారు. ఆయన సీఎం అయ్యాక ఆస్తుల పంపకాల్లో భాగంగా 100 శాతం తనకు, తన పిల్లల భాగానికి వచ్చిందన్నారు. దేవుడి సాక్షిగా ఇది నిజమని చెప్పారు. తన బిడ్డల హక్కు, తన తండ్రి వైఎస్ఆర్ తిరిగిన ఇల్లు కావడంతో తన కుమార్తె అంజిలి కోరినట్లుగా వివాహం అక్కడ చేయాలని అనుకున్నట్లు చెప్పారు. అయితే తన కుమార్తె కోరికను నెరవేర్చలేక పోయామని తెలిపారు.
Yelahanka Palace | వేరే ప్రాంతంలో జరిపిస్తాం
వివాహ వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి, తన బిడ్డ గురించి బాధపడిన ప్రతి ఒక్కరికీ షర్మిల వందనాలు తెలిపారు. అంజలి పెళ్లి వివాద రహితంగా జరగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. వైఎస్ అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డిల వివాహాన్ని యలహంక ఇంట్లో కాకుండా, వేరే ప్రదేశంలో జరపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కాగా యలహంక ప్యాలెస్ బెంగళూరులో ఉంది. 23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాపర్టీ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.
ఇది కూడా చదవండి..: Fire Accident | విశాఖ పోర్టులో భారీ అగ్నిప్రమాదం..