అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Municipal Workers Punctuality | మున్సిపల్ కార్మికులు (Municipal Workers) సమయపాలన పాటిస్తూ విధులకు హాజరు కావాలని కమిషనర్ దిలీప్‌కుమార్ అన్నారు. శనివారం తెల్లవారుజామున ఆయన పలు జోన్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Municipal Workers Punctuality | హాజరుపట్టికల తనిఖీ..
జోన్ కార్యాలయానికి చేరుకున్న ఆయన మొదట కార్మికులకు సంబంధించిన హాజరుపట్టికను తనిఖీ చేశారు. కార్మికుల హాజరును ధృవీకరించి, వారు సమయానికి విధులకు హాజరవుతున్నారా.. వారికి అప్పగించిన పారిశుధ్య పనులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అని పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నగరమంతటా పరిశుభ్రతను కాపాడటానికి కార్మికులు సమయపాలన, క్రమం తప్పని హాజరు ఉండాలన్నారు. పారిశుధ్య విధులను సమర్థవంతంగా నిర్వర్తించడం యొక్క ప్రాముఖ్యతను కమిషనర్ వివరించారు. ఈ తనిఖీలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జవాన్లు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Banswada Police | ఇద్దరితో వివాహేతర సంబంధం.. అడ్డుగా ఉన్నాడని భర్త హత్య