BRS Rythu Garjana | రైతు సమస్యలపై బీఆర్​ఎస్​ పోరుబాట

రైతు సమస్యలపై బీఆర్​ఎస్​ పోరుబాటకు సిద్ధం అయింది. ఈ మేరకు కేటీఆర్​ సభలు నిర్వహించనున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: BRS Rythu Garjana | ఎల్​నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు తాండవం చేస్తోంది. రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో అన్నదాతల సమస్యలపై బీఆర్​ఎస్​ పోరుబాటకు సిద్ధం అయింది.

రాష్ట్రంలో కరువు, అన్నదాతల ఇబ్బందులు, ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీఆర్​ఎస్​ ఇప్పటికే ఆందోళనలు చేస్తోంది. కరెంట్​ కష్టాలు, సాగునీటి కోసం రైతులతో కలిసి గులాబీ పార్టీ ధర్నాలు, రాస్తారోకోలు చేసింది. అయితే మరింత దూకుడు పెంచేందుకు బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ రంగంలోకి దిగుతున్నారు. ఉత్తర తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తేవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. నవంబర్​లో ఏకంగా నాలుగు సభల్లో ఆయన పాల్గొననున్నారు.

BRS Rythu Garjana | రైతు గర్జన సభలు

అన్నదాతల కష్టాలపై రైతు గర్జన పేరిట కేటీఆర్ సభలు నిర్వహించనునారు. నవంబర్ 1 ఆదిలాబాద్, నవంబర్ 11న నిర్మల్, నవంబర్ 19న నిజామాబాద్ జిల్లా (Nizamabad District)ల్లో రైతు గర్జన సభలు నిర్వహిస్తారు అనంతరం నవంబర్ 29న కరీంనగర్‌లో దీక్షా దివస్ సభ ఏర్పాటు చేయనున్నారు. రైతు గర్జన సభలలో సాగు, తాగునీటి సమస్యలపై ప్రభుత్వాన్ని కేటీఆర్​ నిలదీయనున్నారు. యాసంగిలో పంటలు సాగు చేయొద్దని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో కేటీఆర్​ రైతు గర్జన సభలు నిర్వహిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇది కూడా చదవండి..: Municipal Workers Punctuality | కార్మికులు సమయపాలన పాటించాలి..: మున్సిపల్​ కమిషనర్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *