అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sonam Raghuvanshi Bail | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన భర్త రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య కేసులో ప్రధాన నిందితురాలైన సోనం రఘువంశీకి మంజూరైన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
ఈ కేసులో నిందితురాలు (సోనం) బెయిల్‌పై బయట ఉండటంతో విచారణకు ఆటంకం కలగవచ్చని జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ పి.బి. వరాళేలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఆరు నెలల్లోపు విచారణ పూర్తి కాకపోతే, సోనం విచారణ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. సోనమ్‌పై ఉన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవి అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. మూడు వారాల్లోగా లొంగిపోవాలని కోర్టు సోనమ్‌ను ఆదేశించింది.
Sonam Raghuvanshi Bail | అసలు ఏం జరిగిందంటే..
రాజా, సోనమ్ గత ఏడాది మే 11న వివాహం చేసుకున్నారు. మే 20న వారు మేఘాలయకు హనీమూన్ కోసం వెళ్లారు. మూడు రోజుల తర్వాత వారు అదృశ్యం అయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 10 రోజుల తర్వాత జూన్ 2న రాజా మృతదేహం ఒక లోయలో లభించడంతో హత్య కేసు దర్యాప్తుగా మారింది. సోనమ్ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం ఆమె కూడా తప్పిపోయినట్లు నటించింది.
Sonam Raghuvanshi Bail | షిల్లాంగ్ జిల్లా జైలులో..
జూన్ 7 రాత్రి ఘాజీపూర్‌లోని ఒక ‘ఢాబా’ వద్ద సోనమ్ అపస్మారక స్థితిలో కనిపించింది. చికిత్స కోసం ఆమెను ఘాజీపూర్ మెడికల్ కాలేజీకి తరలించగా, అక్కడ ఆమె పోలీసులకు లొంగిపోయింది. ఆ తర్వాత సోనమ్ ప్రియుడు రాజ్ సింగ్ కుష్వాహాను కూడా పోలీసులు అరెస్టు చేశారు.షిల్లాంగ్ జిల్లా జైలులో సుమారు 10 నెలల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆమెకు ఏప్రిల్ 27న ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ధర్మాసనం బెయిల్ రద్దు చేసింది.
ఇది కూడా చదవండి..: Rahul Gandhi Demands | యువత భవిష్యత్తును నాశనం చేసింది మీరే.. మోదీపై రాహుల్ గాంధీ ఆగ్రహం