Srisailam Sparsha Darshan | శ్రీశైలం వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ దర్శనాలు నిలిపివేత!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Srisailam Sparsha Darshan | శ్రీశైలంలో నేటి నుంచి (మే 29వ తేదీ జూన్ 1) సోమవారం వరకు వీఐపీ బ్రేక్‌ (స్పర్శ) దర్శనాలు నిలిపివేస్తున్నారు. ఈ మేరకు శ్రీశైలం ఈవో ప్రకటన జారీ చేశారు.

Srisailam Sparsha Darshan | ఆన్‌లైన్‌లో టికెట్స్‌ పొందినవారికి..

వేసవి, వారాంతపు సెలవులతో భక్తుల రద్దీ కారణంగా స్పర్శ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈవో వెల్లడించారు. భక్తులకు స్వామి వారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.

ముందుగా ఆన్‌లైన్‌లో స్పర్శ దర్శనం టికెట్స్‌ పొందిన భక్తులకు మాత్రమే యథావిధిగా స్పర్శ దర్శనం కొనసాగింపు ఉంటుందని శ్రీశైలం ఈవో పేర్కొన్నారు.  స్వామివారి భక్తులు ఈ విషయాన్ని గమనించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

akshara today 1 1.jpgsri shai 1

వారాంతంలో శ్రీశైలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్​కు దగ్గరగా ఉండటంతో మహా నగరానికి చెందిన భక్తులు ఎక్కవగా వస్తున్నట్లు పేర్కొన్నారు. స్వామివారి దర్శనంతోపాటు ప్రకృతి అందాలను తిలకించేందుకు శ్రీశైలం చక్కని అనువైన పుణ్యక్షేత్రం అని వివరించారు.

DK Shivakumar Biography | ట్రబుల్​ షూటర్​.. కాంగ్రెస్​ పార్టీకి తిరుగులేని…

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *