బిజినెస్​May 29 Gold Rates | లక్ష్మీవారం తీపి కబురు.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి...

May 29 Gold Rates | లక్ష్మీవారం తీపి కబురు.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు!

అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా పరిణామాల ప్రభావంతో ఇటీవల రికార్డు స్థాయికి చేరిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు వరుసగా మూడో రోజు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం దేశీయ మార్కెట్లో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గగా.. ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇలా ఉన్నాయి.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 29 Gold Rates | గత కొంతకాలంగా బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు వరుసగా పెరుగుతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా పసిడి ధరలు భారీగా ఎగిసిపడ్డాయి.

అయితే ఇటీవల కొంత స్థిరపడిన మార్కెట్‌లో ఇప్పుడు వరుసగా మూడు రోజులుగా బంగారం, వెండి ధరలు Silver Prices తగ్గుముఖం పడుతున్నాయి. పలు బులియన్ వెబ్‌సైట్ల ఆధారంగా మే 29, 2026 ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.10 మేర తగ్గి రూ.1,56,050 వద్ద కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములపై రూ.10 తగ్గి రూ.1,43,040కు చేరింది. ఇక వెండి ధర కిలోకు రూ.100 తగ్గి రూ.2,74,900గా నమోదైంది.

akshara today 1 6.jpggold 6

May 29 Gold Rates | ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,56,050 కాగా.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,43,040గా ఉంది. వెండి కిలో ధర మాత్రం రూ.2,84,900గా నమోదైంది.

విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,56,200గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,43,190గా ఉంది. వెండి కిలో ధర రూ.2,74,900 వద్ద ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,56,050 కాగా.. 22 క్యారెట్ల ధర రూ.1,43,040గా నమోదైంది. అక్కడ వెండి ధర కూడా రూ.2,74,900గా ఉంది.

చెన్నైలో Chennai మాత్రం బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,58,170 కాగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,44,990గా ఉంది. వెండి కిలో ధర రూ.2,84,900గా నమోదైంది.

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం రూ.1,56,050, 22 క్యారెట్ల ధర రూ.1,43,040గా కొనసాగుతోంది. వెండి కిలో ధర రూ.2,74,900గా ఉంది.

May 29 Gold Rates | రాబోయే రోజుల్లో

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ మారకం విలువ, క్రూడ్ ఆయిల్ ధరలు, జియోపాలిటికల్ టెన్షన్స్, అలాగే కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

దీంతో రాబోయే రోజుల్లో కూడా పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక బంగారం, వెండి ధరలు దేశవ్యాప్తంగా ఒకేలా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా పరిస్థితులు, రాష్ట్ర పన్నులు, జీఎస్టీ, ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీ Transport cvharges లు వంటి అంశాల ఆధారంగా ధరల్లో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. అందుకే ప్రధాన నగరాల్లో ధరల్లో కొంత వ్యత్యాసం కనిపిస్తుంది.

Swathi Reddy | పెళ్ళి చేసుకోవడం కన్నా కుక్కను పెంచుకోవడం బెటర్…..

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

May 30 Gold Rates | మళ్లీ బంగారం, వెండి ధరల పరుగులు.. ఒక్కరోజులోనే ఎంత పెరిగిందంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 30 Gold Rates | బులియన్ మార్కెట్‌లో...

May 30 Horoscope | కష్టాలకు ఇక ఎండ్​ కార్డ్​.. ఈ రాశుల వారికి నేడు ఆకస్మిక ధన యోగం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 30 Horoscope | గ్రహాల సంచారంలో వస్తున్న...

Minister Quarters Swimming Pool | ఒలింపిక్స్‌లో ‘మినిస్టర్’ మెడల్ పక్కా? క్వార్టర్స్‌లో రూ.2.63 కోట్లతో స్విమ్మింగ్ పూల్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Minister Quarters Swimming Pool | తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను...

Japan Population Crisis | సూర్యుడు ఉదయించే దేశంలో.. శృంగార అస్తమయం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Japan Population Crisis | జపాన్.. సాంకేతికతకు మారుపేరు....