అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad Missing Person Death | తప్పిపోయిన వ్యక్తి నగర శివారులోని నిజాంసాగర్ కాలువలో శవమై తేలాడు. అ మేరకు 5వ పోలీస్‌స్టేషన్ పోలీసులు వివరాలు వెల్లడించారు.
Nizamabad Missing Person Death | ఇంద్రాపూర్‌కు చెందిన..
నగరం (Nizamabad)లోని ఇంద్రాపూర్ కాలనీకి చెందిన కండగాలే అశోక్ పెయింటర్‌గా పనిచేస్తుండేవాడు. అయితే ఆయన ఈనెల21వ తేదీ నుంచి అదృశ్యమయ్యాడు. దీంతో ఆయన తల్లి తులసీ 5వ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అయితే 23వ తేదీ బుధవారం అశోక్ మృతదేహం నగరశివారులోని నిజాంసాగర్ కాలువలో తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
ఇది కూడా చదవండి..: Inter Special Admissions | విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్లో ప్రత్యేక అడ్మిషన్లకు అవకాశం..