OPPO Find X10 | ఒప్పో ఫైండ్ ఎక్స్10 సిరీస్ లాంచ్.. ట్రిపుల్ 200ఎంపీ కెమెరాలతో మార్కెట్లోకి అద్భుతమైన ఫ్లాగ్‌షిప్ ఫోన్లు

స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి తెరలేపుతూ ప్రముఖ మొబైల్ బ్రాండ్ ఒప్పో (OPPO) భారత్‌లో తన సరికొత్త 'ఒప్పో ఫైండ్ ఎక్స్10' (OPPO Find X10) సిరీస్‌ను అధికారికంగా విడుదల చేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: OPPO Find X10 | స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి తెరలేపుతూ ప్రముఖ మొబైల్ బ్రాండ్ ఒప్పో (OPPO) భారత్‌లో తన సరికొత్త ‘ఒప్పో ఫైండ్ ఎక్స్10’ (OPPO Find X10) సిరీస్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఫైండ్ ఎక్స్ సిరీస్‌లో పదో తరఫుగా వస్తున్న ఈ లైనప్‌లో భాగంగా ‘ఒప్పో ఫైండ్ ఎక్స్10’, ‘ఒప్పో ఫైండ్ ఎక్స్10 ప్రో మ్యాక్స్’ మోడళ్లను మార్కెట్లోకి తెచ్చారు. అద్భుతమైన కెమెరా వ్యవస్థ, శక్తివంతమైన ప్రాసెసర్, దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్ అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో ఈ ఫోన్లను రూపొందించారు.

OPPO Find X10 | హ్యాసిల్‌బ్లాడ్ సహకారం..

ఈ సిరీస్‌లో కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఒప్పో ఫైండ్ ఎక్స్10 మోడల్ డ్యూయల్ 200ఎంపీ కెమెరా సిస్టమ్‌తో రాగా, అత్యంత శక్తివంతమైన ‘ఒప్పో ఫైండ్ ఎక్స్10 ప్రో మ్యాక్స్’ ఫోన్ వెనుక మూడు కెమెరాల్లోనూ 200ఎంపీ రెసల్యూషన్‌ను అందించే విప్లవాత్మక ట్రిపుల్ 200ఎంపీ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ప్రపంచ ప్రఖ్యాత ‘హ్యాసిల్‌బ్లాడ్’ (Hasselblad) సహకారంతో దీనిని అభివృద్ధి చేశారు. సహజమైన రంగులు, అద్భుతమైన షాడోస్, క్లారిటీ కోసం లూమో ట్రూ ఇమేజ్ ఇంజిన్‌ను అమర్చారు. వీడియోల కోసం 4K సినిమా-గ్రేడ్ HDR, డాల్బీ విజన్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

OPPO Find X10 | శక్తివంతమైన బ్యాటరీ ..

ఈ ఫోన్లలో సుమారు 8000mAh సామర్థ్యం గల సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందించారు. ఇది 80W సూపర్ ఊక్ (SUPERVOOC) వైర్డ్ ఛార్జింగ్, 50W ఎయిర్‌వూక్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఫైండ్ ఎక్స్10 ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9600M ప్రాసెసర్‌పై పనిచేస్తుండగా, హై-ఎండ్ ఫైండ్ ఎక్స్10 ప్రో మ్యాక్స్ మోడల్ అత్యాధునిక 2nm మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో ప్రాసెసర్‌తో వస్తుంది. అలాగే సరికొత్త కలర్‌ఓఎస్ 17 (ColorOS 17) సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని మరింత సులభతరం చేస్తుంది.

OPPO Find X10 | ధరలు ఇతర గాడ్జెట్లు..

ఒప్పో ఫైండ్ ఎక్స్10 (12GB + 256GB): రూ. 1,39,999

ఒప్పో ఫైండ్ ఎక్స్10 (12GB + 512GB): రూ. 1,69,999

ఒప్పో ఫైండ్ ఎక్స్10 ప్రో మ్యాక్స్ (12GB + 512GB): రూ. 1,99,999

హ్యాసిల్‌బ్లాడ్ టెలికన్వర్టర్ కిట్: రూ. 24,999

ఈ ఫోన్లతో పాటు ఒప్పో సంస్థ తన ఎకోసిస్టమ్‌ను విస్తరిస్తూ.. ఒప్పో ప్యాడ్ మినీ ట్యాబ్లెట్ (రూ. 94,999), ఒప్పో ఎన్కో ఎక్స్4 ఇయర్‌బడ్స్ (రూ. 19,999), 10,000mAh పవర్ బ్యాంక్ (రూ. 2,199) వంటి ఉత్పత్తులను కూడా విడుదల చేసింది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై తక్షణ క్యాష్‌బ్యాక్, సులభమైన ఈఎంఐ ఆప్షన్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: PM Rahat Scheme | పీఎం రాహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *