HYDRAA | మూడు చెరువులను కాపాడిన హైడ్రా

హైదరాబాద్ నగరంలో మూడు చెరువులను హైడ్రా కాపాడింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA | హైదరాబాద్​ నగరంలో చెరువుల పరిరక్షణకు హైడ్రా కృషి చేస్తోంది. ఓ వైపు ఆక్రమణలు తొలగిస్తోంది. మరోవైపు చెరువులు పునరుద్ధిస్తోంది. తాజాగా మూడు చెరువుల చుట్టూ ఫెన్సింగ్​ వేసింది.

ప‌లు చెరువుల ఎఫ్‌టీఎల్ ప‌రిధిల‌ను ర‌క్షిస్తూ ఫెన్సింగ్ వేసిన హైడ్రా గురువారం 3 చెరువుల‌కు ఫెన్సింగ్ వేసింది. వీటితో పాటు.. పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను కూడా హైడ్రా కాపాడింది. కీస‌ర మండ‌లం రాంప‌ల్లి ప‌రిధిలోని శ్రీ‌నివాస్ కాల‌నీ, స‌ర్వే నంబ‌రు 414/105లో ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన 1127 గ‌జాల స్థ‌లాన్నిహైడ్రా కాపాడింది. ఇదే ప్రాంతంలో 1797 గ‌జాల పార్కు స్థ‌లాన్ని కూడా హైడ్రా రక్షించింది. ఈ లే అవుట్​లో పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని తర్వాత విక్రయించారు. దీంతో అక్కడ చేపట్టిన తాత్కాలిక నిర్మాణాలను హైడ్రా కూల్చి వేసింది.

HYDRAA | శేరిలింగంపల్లిలో..

రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లిలో చాక‌లి చెరువును కాపాడుతూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. మొత్తం 16.20 ఎక‌రాల చెరువు ప‌రిధి కాగా ఇందులో దాదాపు 4 ఎక‌రాల వ‌ర‌కూ క‌బ్జాల‌కు గురౌతున్న‌ట్టు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా తాత్కాలికంగా వేసిన షెడ్డుల‌ను హైడ్రా తొలగించింది. అలాగే రంగారెడ్డి జిల్లా స‌రూర్ న‌గ‌ర్ మండలంలోని ఫ‌తుల్లగూడ చెరువుకు ఫెన్సింగ్ వేసింది. అలాగే సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్​లోని బందంకొమ్ము చెరువును కూడా కాపాడింది.

దీనిని కూడా చదవండి : CM Revanth Reddy | సిద్దిపేట గడ్డ.. కాంగ్రెస్​ అడ్డా : సీఎం రేవంత్​రెడ్డి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *