May 18 Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు.. బలహీనంగా ప్రారంభం కానున్న సెన్సెక్స్

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 18 Market Analysis | జియో పొలిటికల్ టెన్షన్స్(Geo political tensions) పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం రష్యా Russia పై ఉక్రెయిన్ భీకర దాడులు చేయడం, ఇరాన్‌పై మళ్లీ దాడులకు అమెరికా సన్నద్ధమవుతుండడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

దీంతో గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్ , యూరోప్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సోమవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు మాత్రం నష్టాలతో సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) నష్టాలతో ఉండడంతో మన మార్కెట్లు నెగెటివ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

May 18 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

క్రూడ్ ఆయిల్ ధరతోపాటు ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుతుండడంతో వాల్‌స్ట్రీట్ ఒత్తిడికి గురవుతోంది. గత సెషన్‌లో నాస్‌డాక్ 1.54 శాతం, ఎస్ అండ్ పీ 1.24 శాతం నష్టపోయాయి. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.75 శాతం నష్టంతో ఉంది.

May 18 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 2.11 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 1.74 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 1.63 శాతం క్షీణించాయి.

May 18 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 1.35 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.09 శాతం లాభాలతÃ ఉండగా.. తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.52 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.42 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.95 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.49 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.61 శాతం నష్టంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్‌లో ప్రారంభం కానున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు వరుసగా రెండో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 1,329 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • డీఐఐలు పద్నాలుగో సెషన్ తర్వాత నికర అమ్మకందారులుగా మారారు. గత సెషన్‌లో నికరంగా రూ. 1,958కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.17 నుంచి 1.01కు తగ్గింది.
  • విక్స్ 0.95 శాతం పెరిగి 18.79 వద్ద ఉంది.
  • క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 111.22 డాలర్ల వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.35వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.63 వద్ద ఉన్నాయి.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 19 పైసలు బలహీనపడి 95.96 వద్ద ఉంది.

Chola Copper Plates | 14 ఏళ్ల నిరీక్షణకు తెర.. స్వదేశానికి ‘చోళుల కాలం నాటి రాగి శాసనాలు’!

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *