Modi Norway Visit | నార్వేలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi Norway Visit | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) నార్వే చేరుకున్నారు. స్వీడన్​ పర్యటన ముగించుకొని ఆయన నార్వేలోని ఓస్లోలో ల్యాండ్​ అయ్యారు. అక్కడ ప్రధానికి ఘన స్వాగతం లభించింది.

 Modi Norway Visit | ఇదే మొదటిసారి

విమానాశ్రయంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గార్ స్టోర్ తనకు ఇచ్చిన ఆత్మీయ స్వాగతానికి కృతజ్ఞుడను అని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్​ వేదికగా ఫొటోలు పంచుకున్నారు. 40 ఏళ్లకు పైగా కాలంలో ఒక భారత ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటన భారత్, నార్వేల మధ్య స్నేహాన్ని మరింత బలపరుస్తుందని మోదీ అన్నారు. మోదీ మహారాజు హెరాల్డ్, మహారాణి సోంజాను కలుసుకుని, ప్రధానమంత్రి స్టోర్‌తో చర్చలు జరపనున్నారు. మంగళవారం ఓస్లోలో మూడవ భారత్-నార్డిక్ శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.

Modi Norway Visit | స్వీడన్​తో కీలక ఒప్పందాలు

నార్వే పర్యటనకు ముందు ప్రధాని స్వీడన్​లో ప్రటించారు. ఈ క్రమంలో ఆదేశంలో పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. గోథెన్‌బర్గ్‌లో, స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్‌సన్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌ల సమక్షంలో భారత్, స్వీడన్ తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఉన్నతీకరించి, ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను ఆమోదించాయి. తన వృద్ధి ప్రస్థానాన్ని భవిష్యత్తుకు సిద్ధం చేసుకోవడానికి, భారతదేశం ఆవిష్కరణలకు అధిక ప్రాధాన్యతనిచ్చే, సాంకేతికతతో సుసంపన్నమైన యూరోపియన్ ఆర్థిక వ్యవస్థలతో కలిసి పని చేస్తుంది.

ఇది వస్తు వాణిజ్యానికి మాత్రమే సంబంధించినది కాదని, ఇది ఏఐ (AI), రక్షణ రంగ తయారీ, కీలక ఖనిజాలు, హరిత పరివర్తన, అంతరిక్షం, డిజిటల్ మౌలిక సదుపాయాలు మరియు పటిష్టమైన సరఫరా గొలుసులలో ఒప్పందం ఉంటుందని అధికారులు తెలిపారు. భద్రత, స్థిరత్వం కోసం వ్యూహాత్మక సంప్రదింపులు, తదుపరి తరం ఆర్థిక భాగస్వామ్యం, వర్ధమాన సాంకేతికతలు, విశ్వసనీయ అనుసంధానం వంటి అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చించారు.

ఇది కూడా చదవండి..: Vijay Government Crisis | తమిళనాడు రాజకీయాల్లో వేడి పెంచిన డీఎంకే వ్యాఖ్యలు.. విజయ్ ప్రభుత్వం కూలిపోతుంది, మ‌ళ్లీ స్టాలినే సీఎం..!

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *