India Nordic Summit | ఇండియా – నార్డిక్​ సమ్మిట్​లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India Nordic Summit | విదేశీ పర్యటనలో ప్రధాని మోదీ (PM Modi) మంగళవారం నార్వేలో జరిగిన ఇండియా–నార్డిక్​ దేశాల సమ్మిట్​లో పాల్గొన్నారు. ఓస్లోలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.

కొన్నేళ్లుగా భారత్​, నార్డిక్ దేశాలు అసాధారణమైన పురోగతిని సాధించాయని ప్రధాని అన్నారు. వాణిజ్య సంబంధాలు బలపడ్డాయని, పెట్టుబడి అనుసంధానాలు పెరిగాయని పేర్కొన్నారు. ఈ సంబంధాలను హరిత సాంకేతికత, ఆవిష్కరణల వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. భారత్-నార్డిక్ శిఖరాగ్ర సమావేశం సుస్థిరత, విశ్వసనీయ సాంకేతికతలు, మానవాళికి ఒక మెరుగైన భవిష్యత్తు పట్ల మన ఉమ్మడి నిబద్ధతను ముందుకు తీసుకువెళ్తుందన్నారు.

India Nordic Summit | అనేక అంశాలపై చర్చలు

ఈ సమావేశంలో సుస్థిరత, ఆవిష్కరణ, స్వచ్ఛ ఇంధనం, వర్ధమాన సాంకేతికతలు, శాంతియుత, సుసంపన్నమైన భవిష్యత్తు కోసం సహకారాన్ని బలోపేతం చేయడం వంటి అనేక అంశాలపై చర్చించినట్లు ప్రధాని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య నైపుణ్యాభివృద్ధి, ప్రతిభ బదిలీలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన నార్వే ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

దీనిని కూడా చదవండి : India Norway business summit | భారత్, నార్వేల మధ్య అపారమైన పెట్టుబడి అవకాశాలు: నార్వే వ్యాపార సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *