అంతర్జాతీయంExplosion in Iran | ఇరాన్‌లో భారీ పేలుడు.. 14 మంది ఐఆర్‌జీసీ సైనికులు మృతి

Explosion in Iran | ఇరాన్‌లో భారీ పేలుడు.. 14 మంది ఐఆర్‌జీసీ సైనికులు మృతి

ఇరాన్‌లోని జంజాన్ ప్రావిన్స్‌లో జరిగిన భారీ పేలుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. యుద్ధ అవశేషాలను తొలగించే సమయంలో జరిగిన ఈ ఘటనలో ఐఆర్‌జీసీకి చెందిన 14 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Explosion in Iran | ఇరాన్​లోని జంజాన్ ప్రావిన్స్‌లో (Zanjan Province)లో శుక్రవారం జరిగిన ఘోర పేలుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రమాదంలో ఆ దేశ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ Islamic Revolutionary Guard Corps (ఐఆర్‌జీసీ)కు చెందిన 14 మంది సభ్యులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు అధికారిక మీడియా సంస్థ ఇస్లామిక్ రిప‌బ్లిక్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.

జంజాన్ సమీపంలోని ఒక కలుషిత ప్రాంతంలో యుద్ధ సమయంలో మిగిలిపోయిన పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే పనిలో ఉన్న ఐఆర్‌జీసీ డిమోలిషన్ టీమ్‌పై ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రాంతం ఇటీవల జరిగిన యుద్ధంలో వైమానిక దాడులకు గురైనట్లు సమాచారం. ఆ సమయంలో పడేసిన క్లస్టర్ బాంబులు, ఎయిర్ మైన్లు ఇంకా భూమిలో ఉండడమే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని అధికారులు తెలిపారు.

Explosion in Iran | ఊహించ‌ని ప్రమాదం..

ఐఆర్‌జీసీకి చెందిన అన్సార్ అల్-మహ్దీ విభాగం ప్రకారం, మరణించిన వారు బాంబులను నిర్వీర్యం చేయడంలో అనుభవం ఉన్న నిపుణులే. సుమారు 1,200 హెక్టార్ల వ్యవసాయ భూముల్లో పేలని బాంబులు విస్తరించి ఉన్నాయని, వాటిని తొలగించే ప్రక్రియలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని వెల్లడించారు. ఇరాన్-యూఎస్‌-ఇజ్రాయెల్ సీజ్‌ఫైర్ Iran–US–Israel ceasefire April 2026 అమల్లోకి వచ్చిన తర్వాత ఐఆర్‌జీసీకి జరిగిన అతిపెద్ద నష్టం ఇదేనని విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధం ముగిసినప్పటికీ, భూమిలో మిగిలిపోయిన పేలుడు పదార్థాలు సైన్యం మరియు సాధారణ ప్రజలకు పెద్ద ప్రమాదంగా మారుతున్నాయి.

Explosion in Iran | భారీగా పేలని బాంబుల నిర్వీర్యం

ఇప్పటివరకు ఐఆర్‌జీసీ బృందాలు 15,000కు పైగా పేలని బాంబులను నిర్వీర్యం చేసినప్పటికీ, ఇంకా కొన్ని ప్రాంతాల్లో ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్లీనింగ్ ఆపరేషన్లను తాత్కాలికంగా నిలిపివేసి, పేలుడుకు గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు ఉన్నత స్థాయి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరోవైపు, పౌర ప్రాంతాల సమీపంలో క్లస్టర్ బాంబుల వినియోగాన్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇవి చాలా కాలం పాటు ముప్పుగా మిగిలి, నిరపరాధ ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన ఇరాన్‌తో IRan పాటు ఇతర దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇది కూడా చదవండి..: US Iran Conflict | యుద్ధం ముగిసినట్లే.. ట్రంప్​ కీలక ప్రకటన!

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Auto Sales in India | ఆటో.. అదరహో.. రికార్డు స్థాయిలో వాహనాల విక్రయాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Auto Sales in India | కార్ల...

Palk Strait Swim Record | పాక్​ జలసంధిని ఈదిన బుడతడు.. ఏడేళ్ల బాలుడి రికార్డు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Palk Strait Swim Record | జార్ఖండ్‌...