అంతర్జాతీయంUS Iran Conflict | యుద్ధం ముగిసినట్లే.. ట్రంప్​ కీలక ప్రకటన!

US Iran Conflict | యుద్ధం ముగిసినట్లే.. ట్రంప్​ కీలక ప్రకటన!

ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణిగినట్లు ట్రంప్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. దీనిపై అమెరికా కాంగ్రెస్ సభ్యులు, అంతర్జాతీయ వర్గాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: US Iran Conflict | అమెరికా అధ్యక్షుడు Donald Trump ఇరాన్‌తో జరిగిన ఘర్షణలపై కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రస్తుతం ముగిసినట్టేనని ఆయన పేర్కొన్నారు.. ఏప్రిల్ 7 తర్వాత ఇరు దేశాల మధ్య ఎలాంటి దాడులు జరగలేదని, ప్రస్తుతం సీజ్‌ఫైర్ కొనసాగుతున్న నేపథ్యంలో యుద్ధ పరిస్థితులు లేవని స్పష్టం చేశారు.

US Iran Conflict | సీజ్‌ఫైర్..

War Powers Act ప్రకారం, అమెరికా అధ్యక్షుడు యుద్ధాన్ని ప్రారంభించిన తర్వాత 60 రోజుల లోపు కాంగ్రెస్ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ గడువు తాజాగా ముగియడంతో, ఇకపై యుద్ధాన్ని కొనసాగించేందుకు కాంగ్రెస్ ఆమోదం అవసరం లేదని ట్రంప్ పేర్కొన్నారు. సీజ్‌ఫైర్ కొనసాగుతున్నందున యుద్ధం అధికారికంగా ముగిసినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇరాన్‌తో నెలకొన్న ఈ ఘర్షణలు అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణిగినట్లు ట్రంప్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. దీనిపై అమెరికా కాంగ్రెస్ సభ్యులు, అంతర్జాతీయ వర్గాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

Health Ticket Bus | శారీరక శ్రమతోనే ప్రయాణం.. 20 బస్కీలు తీస్తే బస్సు టికెట్ ఉచితం!

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Balakonda suicide attempt | ప్రియుడు మోసం చేశాడని మనస్తాపం.. పోలీస్​ స్టేషన్​ పైనుంచి దూకిన యువతి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Balakonda suicide attempt | ప్రేమ పేరుతో ఒకడు నమ్మించాడు.....

May 02 Horoscope | డెయిరీ రంగంలో లాభాల బాట.. ఆర్థికంగా పురోగతి లభించేది ఈ రాశుల వారికే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 02 Horoscope | పలు రాశుల వారికి...

Health Ticket Bus | శారీరక శ్రమతోనే ప్రయాణం.. 20 బస్కీలు తీస్తే బస్సు టికెట్ ఉచితం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Health Ticket Bus | సాధారణంగా బస్సు BUS...

Cattle Shed Fire | ప్రమాదవశాత్తు పశువుల కొట్టానికి నిప్పు.. అగ్నికీలల్లో జీవాలు విలవిల

అక్షరటుడే, గాంధారి: Cattle Shed Fire | ప్రమాదవశాత్తు కొట్టానికి నిప్పు...