Steel Plant Accident | విశాఖ స్టీల్ ప్లాంట్​ ఘటనలో 9కి చేరిన మృతులు..

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్​ జగన్​ పరామర్శించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Steel Plant Accident | విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. ప్లాంట్ సోమవారం సాయంత్రం అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

ఉక్కుద్రవం తరలిస్తున్న లాడర్​ పేలడంతో 8 మంది కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో సెవెన్‌ హిల్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పైడిరాజు అనే కార్మికుడు బుధవారం కన్ను మూశాడు. మూడురోజుల పాటు మృత్యువుతో పోరాడి పైడిరాజు ఓడిపోయాడు.

Steel Plant Accident | వైఎస్​ జగన్​ పరామర్శ

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత విశాఖపట్నం చేరుకున్నారు. స్టీల్ ప్లాంట్​ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న కార్మికులను ఆయన పరామర్శించారు. సెవెన్‌ హిల్స్‌, కిమ్స్‌ ఐకాన్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కాగా జగన్​ పర్యటన నేపథ్యంలో విశాఖ ఎయిర్‌పోర్టు (Visakhapatnam Airport) వ‌ద్ద వైసీపీ నేత‌ల‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారిలో బారీకేడ్లు పెట్టి వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

ఇది కూడా చదవండి..: Steel Plant Compensation | స్టీల్‌ప్లాంట్‌ ఘటన.. పరిహారం ప్రకటించిన పవన్‌

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *