Sonam Wangchuk Education | యువత, ప్రభుత్వాల మధ్య నమ్మకమే ముఖ్యం: సోనమ్ వాంగ్‌చుక్

ప్రభుత్వానికి, యువతకు మధ్య పరస్పర నమ్మకం ఉన్నప్పుడే అద్భుతమైన దేశ నిర్మాణం సాధ్యపడుతుందని ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Sonam Wangchuk Education | ప్రభుత్వానికి, యువతకు మధ్య పరస్పర నమ్మకం ఉన్నప్పుడే అద్భుతమైన దేశ నిర్మాణం సాధ్యపడుతుందని ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు. పార్లమెంట్‌లో ‘పబ్లిక్‌ పరీక్షల (అనుచిత పద్ధతుల నివారణ) సవరణ బిల్లు 2026’ ప్రవేశపెట్టడాన్ని ఆయన స్వాగతించారు. కేవలం పరీక్షల నిర్వహణలోనే కాకుండా, దేశ విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పులు రావడానికి ఈ బిల్లు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొంటూ ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఓ వీడియోను విడుదల చేశారు.

Sonam Wangchuk Education | నీట్ ఆందోళనలపై స్పందన..

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో దిల్లీలో జరిగిన ఆందోళనల గురించి వాంగ్‌చుక్ ప్రస్తావించారు. నిరసనకారులపై నమోదైన కేసులను ఎత్తివేస్తామని లిఖితపూర్వక హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఆ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. ఆందోళనకారులపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌లను తక్షణమే కొట్టివేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) డిమాండ్ చేయడంతో పాటు, లేదంటే మళ్లీ నిరసనలు చేపడతామని హెచ్చరించిన తరుణంలో వాంగ్‌చుక్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Sonam Wangchuk Education | వందేభారత్ రైలు ప్రయాణంపై ప్రశంసలు..

మరోవైపు, దిల్లీ నుంచి శ్రీనగర్‌ వరకు వందేభారత్ రైలులో ప్రయాణించిన వాంగ్‌చుక్ భారతీయ రైల్వే పురోగతిని కొనియాడారు. చీనాబ్ రైల్వే వంతెనపై సాగిన ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉందని, దేశ ప్రయాణాన్ని చూస్తే ఎంతో గర్వంగా అనిపించిందని తెలిపారు. తన బృందంతో కలిసి కశ్మీర్‌లో ఒక రోజు గడిపిన తర్వాత వారు లద్దాఖ్‌కు పయనమయ్యారు.

ఇది కూడా చదవండి:  Abhijeet Dipke BJP | బీజేపీలోకి రావాలని బెదిరింపులు.. సీజేపీ చీఫ్ సంచలన ఆరోపణలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *