అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bay of Bengal Low Pressure | అర్నబ్ తుఫాన్‌తో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఇప్పటికే అతలాకుతలమైంది. ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పలు ప్రాంతాలు జలమయమై, పంట పొలాలు నీట మునగడంతో ఉత్తరాంధ్ర చిగురుటాకులా వణికింది. కృష్ణ, గుంటూరు జిల్లాల్లోనూ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపించింది. దీని తీవ్రత పూర్తిగా తగ్గకముందే మళ్లీ ఇంకో అల్పపీడనం ముంచుకొస్తోంది.
Bay of Bengal Low Pressure | మరో అల్పపీడనం..
బంగాళాఖాతంలో తాజాగా మరో అల్పపీడనం ఏర్పడింది. దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇది ఏర్పడినట్లు గుర్తించారు. మరో 24 గంటల్లో ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదిలి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావం అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతంలో స్పష్టంగా కనిపించనుంది.
ఇది కూడా చదవండి..: UP Government Jobs | వారికి ఉద్యోగాలు లేవు.. యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం