అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kaluputics viral boy | సోషల్ మీడియా ప్రపంచంలో ఒక్క వీడియోతోనే జీవితాలు మారిపోతుంటాయి. అలాంటి అరుదైన ఉదాహరణగా నిలిచాడు ఈథియోపియాకు చెందిన యువ ఫ్యాషన్ క్రియేటర్ కలుపుటిక్స్. తన ప్రత్యేకమైన స్టైల్, వినూత్న ప్రెజెంటేషన్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బాలుడు ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాడు.
పాపులర్ సోషల్ మీడియా పేజ్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) అతనిని నేరుగా సంప్రదించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఏప్రిల్ 23, 2026న హబేషా డయాస్పోరా (Habesha Diaspora) అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. కలుపుటిక్స్ ఫోటోతో పాటు, ఇన్‌స్టాగ్రామ్ అతనికి పంపిన మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ, వచ్చే వారం అధికారిక ప్లాట్‌ఫామ్‌లో ఫీచర్ చేయాలని ఉందని తెలిపింది.
Kaluputics viral boy | ఆసక్తిగా చూస్తున్న ప్రపంచం…
అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ మెసేజ్ వెళ్లి చాలా రోజులైనా కలుపుటిక్స్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అభిమానులు, మీడియా పేజీలు, ప్రముఖులు అతనిని సంప్రదించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. హబేశా డయాస్పోరా టీమ్ కూడా తమ ప్రయత్నాలు విఫలమయ్యాయని వెల్లడించింది. కలుపుటిక్స్ ఈథియోపియాలోని మెకెల్లే ప్రాంతానికి చెందినవాడిగా భావిస్తున్నారు. అయితే అతనిని నేరుగా చేరుకునేందుకు ఇప్పటివరకు ఎవరూ ముందుకు రాకపోవడం మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇక అతని ఫేమ్ విషయానికి వస్తే, సాధారణంగా ఒక గోడ Wall ముందు నిలబడి, చుట్టూ షూస్, బ్యాగ్స్, ఫ్యాషన్ ఐటమ్స్ మధ్య తన స్టైల్‌ను ప్రదర్శిస్తూ వీడియోలు తీస్తాడు. ముఖ్యంగా ఒక బ్యాలెన్స్ బోర్డ్‌పై నిలబడి, మ్యూజిక్‌కు అనుగుణంగా తన అవుట్‌ఫిట్‌ను చూపించే విధానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి వీడియో ఒక ఫ్యాషన్ ర్యాంప్ షోను తలపిస్తుంది.
Kaluputics viral boy | 21 వీడియోలతో..
కేవలం 21 వీడియోలతో వైరల్ అయి, సోషల్ మీడియాలో Social media సంచలనం సృష్టించారు ఈ కలుపుటిక్స్. వేగంగా పది లక్షలకు పైగా ఫాలోవర్లను సంపాదించి, అన్ని ప్లాట్‌ఫామ్‌లలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన ఒక్కో వీడియోకు 50 నుంచి 170 మిలియన్స్ లైకులు పైగా వస్తుంటాయి. కేవలం నెలలోనే మిలియన్ ఫాలోవర్లను సంపాదించడం కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణ వస్తువులతో వినూత్న ఫ్యాషన్ స్టైల్స్ రూపొందిస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నఈ వైరల్ బాలుడు ఇన్‌స్టాగ్రామ్ ఆహ్వానానికి స్పందిస్తాడా? లేక ఇంకా మిస్టరీగానే మిగిలిపోతాడా? అన్నది ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.
View this post on Instagram
ఇది కూడా చదవండి : Explosion in Iran | ఇరాన్‌లో భారీ పేలుడు.. 14 మంది ఐఆర్‌జీసీ సైనికులు మృతి

