అక్షరటుడే, వెబ్డెస్క్ : Delhi Pollution Control |దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్నీ కావు. చలికాలం వచ్చిందంటే అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తారు. శ్వాస సంబంధ వ్యాధులు ఉన్నవారు నగరంలో ఉంటే ప్రాణాలకే ప్రమాదం. ఈ క్రమంలో కాలుష్యం నియంత్రణకు ఢిల్లి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ప్రతి ఏడాది చలికాలంలో ఇబ్బందులు తలెత్తున్న దృష్ట్యా కాలుష్య నియంత్రణకు మాస్టర్ ప్లాన్ ప్రభుత్వం చేసింది. చెల్లుబాటు అయ్యే పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికేట్ ఉన్న వాహనాలకు మాత్రమే ఇంధనాన్ని సరఫరా చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిబంధన ఏడాది పొడవునా వర్తిస్తుంది. శీతాకాలపు చర్యలలో భాగంగా, నవంబర్ 1 నుండి జనవరి 31 వరకు కూల్చివేత, సివిల్ నిర్మాణ కార్యకలాపాలను నిషేధిస్తారు.
Delhi Pollution Control |వర్క్ ఫ్రమ్ హోమ్
ఈ ప్లాన్‌లో భాగంగా నవంబర్ 1 నుండి కార్యాలయాలకు 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్, రెట్టింపు పార్కింగ్ ఛార్జీలు కూడా అమల్లోకి వస్తాయి. శీతాకాల కాలుష్య మాస్టర్ ప్లాన్‌ను నోటిఫై చేశామని, దీనిలోని నిబంధనలు ప్రతి సంవత్సరం నవంబర్ 1 నుండి ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉంటాయని ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఢిల్లీని పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడానికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరంమని ముఖ్యమంత్రి రేఖా గుప్తా అన్నారు.
#MissionGreenDelhi
More trees means more oxygen and less pollution.
Let’s make Delhi greener and healthier together. pic.twitter.com/Oa54tblZ4s— vanshi (@vanshi79261) July 1, 2026
దీనిని కూడా చదవండి : Fish Bone Stuck | గొంతులో చేప ముల్లు ఇరుక్కుందా? చిటికెలో క్లియర్ చేసే అద్భుతమైన చిట్కాలు ఇవే!