అక్షరటుడే వెబ్‌డెస్క్: Gujarat Murder Case | గుజరాత్లో తీవ్ర సంచలనం సృష్టించిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే ఉద్దేశంతో భార్య పృథ్వీ తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి పాతిపెట్టి, భర్త ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడని చెప్పి రెండేళ్లుగా అందరినీ నమ్మిస్తూ వచ్చింది.
Gujarat Murder Case | రెండేళ్లుగా నమ్మిస్తూ ..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జామ్‌నగర్‌కు చెందిన జిగ్నేశ్ మావడియా రెండేళ్లుగా కనిపించకుండా పోయాడు. అయితే అతని భార్య పృథ్వీ మాత్రం తన భర్తకు ఆస్ట్రేలియాలో ఉద్యోగం వచ్చిందని, అక్కడే ఉన్నాడని బంధువులకు చెబుతూ వచ్చింది. రెండేళ్లు గడిచినా జిగ్నేశ్ జాడ లేకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. ఈ క్రమంలో జిగ్నేశ్ బంధువు ఒకరు ఆస్ట్రేలియాకు వెళ్లినప్పుడు అతని వివరాలు ఆరా తీయగా, పృథ్వీ చెప్పేందుకు నిరాకరించింది. దీంతో జిగ్నేశ్ సోదరుడు అశోక్ స్వయంగా విచారణ ప్రారంభించగా.. ఆస్ట్రేలియాలో జిగ్నేశ్ పేరుతో ఎలాంటి రికార్డులు లేవని తేలింది. వెంటనే ఆయన పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా, భార్య పృథ్వీ అసలు నిజం బయటపెట్టింది. తన ప్రియుడు నిలేష్‌తో కలిసి భర్తను హత్య చేసినట్లు అంగీకరించింది.
Gujarat Murder Case | హత్యకు దారితీసిన పరిస్థితులు..
ప్రియుడు నిలేష్‌తో పృథ్వీకి పెళ్లికి ముందే ప్రేమసంధం ఉంది. పెళ్లి తర్వాత కూడా వీరు తమ బంధాన్ని కొనసాగించారు. ఈ వివాహేతర సంబంధానికి భర్త జిగ్నేశ్ అడ్డుగా ఉన్నాడని భావించిన పృథ్వీ.. ప్రియుడితో కలిసి అతన్ని అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నింది. పథకంలో భాగంగా జిగ్నేశ్‌కు మద్యం తాగించి, అందులో సైనైడ్ కలిపి హత్య చేశారు. అనంతరం జామ్‌నగర్‌లోని జీఐడీసీ ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీకి మృతదేహాన్ని తరలించి, ముక్కలుగా నరికి సుమారు 12 అడుగుల లోతులో పూడ్చిపెట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా భర్త ఆస్ట్రేలియాలో ఉన్నట్లు నమ్మిస్తూ కాలం వెళ్లదీశారు. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.
गुजरात जामनगर में पत्नी ने प्रेमी संग मिलकर पति को कथित तौर पर शराब में साइनाइड देकर मार डाला। शव फैक्ट्री में दफना दिया और परिवार से कहा कि पति ऑस्ट्रेलिया नौकरी पर गया है। 2 साल बाद शक होने पर पुलिस जांच में पूरा मामला खुल गया। फैक्ट्री से मानव अवशेष बरामद हुए। pic.twitter.com/mo2cC7glYG
— Asif Ansari (@Asifansari9410) July 30, 2026
ఇది కూడా చదవండి: Abhijeet Dipke BJP | బీజేపీలోకి రావాలని బెదిరింపులు.. సీజేపీ చీఫ్ సంచలన ఆరోపణలు