అక్షరటుడే, వెబ్‌డెస్క్: Actor Giribabu | తెలుగు చిత్ర పరిశ్రమ (Telugu film industry)లో విషాదం నెలకొంది. సినీ నటుడు గిరిబాబు (83) కన్నుమూశారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం చనిపోయారు.
తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసే గిరిబాబు అనేక చిత్రాల్లో నటించారు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాల్లో నటించారు. మొత్తంం 600కు పైగా సినిమాలు చేశారు. 1943 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతలలో జన్మించిన ఆయన ఐదు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు.
Actor Giribabu | 1973లో తొలిచిత్రం
గిరిబాబు 1973లో ‘జగమే మాయ’ చిత్రంలో విలన్‌గా సినీ కెరీర్ ప్రారంభించారు. నటుడిగానే కాకుండా నిర్మాత, దర్శకుడిగానూ పని చేశారు. కురుక్షేత్రం, ఇడియట్, అతడు, కితకితలు, రేసుగుర్రం వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని పలువురు అన్నారు. తెలుగు సినీ చరిత్రలో ఇంతటి వైవిధ్యాన్ని చూపించిన అతికొద్ది మంది గొప్ప నటులలో గిరిబాబు ఒకరు.
ఇది కూడా చదవండి..: Shekhar Master | శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం