Urea App Protest | ‘యూరియా యాప్’​ తొలగించాలని రైతుల రాస్తారోకో

యూరియా యాప్​ను తక్షణమే తొలగించాలని రైతులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు ఆర్మూర్​లో రాస్తారాకో చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్: Urea App Protest | యూరియా బుకింగ్​ యాప్​ను తక్షణమే తొలగించాలని రైతులు డిమాండ్​ చేశారు. ఆర్మూర్ మండలం (Armoor Mandal) అంకాపూర్ గ్రామ రైతులు మంగళవారం 63వ నెంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.

Urea App Protest | యాప్​తో నానా ఇబ్బందులు

రైతులు మాట్లాడుతూ.. యూరియా యాప్​ (Urea App)తో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రస్తుతం మొక్కజొన్నకు యూరియా చల్లే సమయం ఆసన్నమైందని తాము పొలంలో పని చేసుకోవాలా లేక యూరియా కోసం లైన్​ కట్టాలా అనే అయోమయ స్థితిలో ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం (State Government) తీసుకొచ్చిన యూరియా యాప్​ను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతులకు వారి అవసరాలకు అనుగుణంగా యూరియాను అందించాలని కోరారు. రాస్తారోకో కారణంగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాడంతో ఆర్మూర్ ఎస్​హెచ్​వో సత్యనారాయణ గౌడ్ ఘటనాస్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి సముదాయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేవేందర్ రెడ్డి, రైతు నాయకులు నవీన్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Minors Theft | జల్సాల కోసం అడ్డదారి తొక్కిన మైనర్లు.. ఆన్​లైన్​ షాపింగ్​ మోజులో చోరీలు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *