Agmont Enterprises IPO | ఊరించిన జీఎంపీ.. 22 శాతం లాభాలతో లిస్టయిన అగ్‌మోంట్ షేర్లు

గోల్డ్ ట్రేడింగ్ చేసే అగ్‌మోంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ షేర్లు సోమవారం స్టాక్ మార్కెట్‌లో సుమారు 22 శాతం ప్రీమియంతో లిస్టయ్యాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Agmont Enterprises IPO | గోల్డ్ ట్రేడింగ్ చేసే అగ్‌మోంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీని 2012లో ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ వ్యాపారం ప్రధానంగా ఇంటిగ్రేటెడ్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంది. రిఫైనింగ్, బులియన్ ట్రేడింగ్, డిజిటల్ గోల్డ్ సేవలు, జ్యువెలరీ తయారీ వంటి విలువ గొలుసులోని వివిధ దశలలో కంపెనీ పాలుపంచుకుంటోంది.

Agmont Enterprises IPO | విశేష స్పందన..

మార్కెట్ నుంచి రూ. 825 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవో (IPO)కు వచ్చిన అగ్‌మోంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీకి ఇన్వెస్టర్లనుంచి మంచి ఆదరణ లభించింది. మొత్తం ఇష్యూ 111.18 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇందులో క్యూఐబీలు 238.46 రెట్లు, ఎన్ఐఐలు 127.63 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్లు 32.64 రెట్లు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు.

Agmont Enterprises IPO | జీఎంపీ బాగున్నా..

కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఒక్కో షేరుకు సోమవారం ఉదయం జీఎంపీ 36.80 శాతం ప్రీమియం ఉంది. అయితే మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో లాభాలు తగ్గాయి. కంపెనీ ఒక్కో షేరును ధర రూ. 788 కి విక్రయించగా.. 21.95 శాతం ప్రీమియంతో రూ. 961 వద్ద లిస్టయ్యాయి. లిస్టింగ్ తర్వాత రూ. 1,019.80 వద్ద ఆల్‌టైం గరిష్టాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత ప్రాఫిట్ బుకింగ్‌తో లాభాలు తగ్గాయి. ఉదయం 11 గంటల ప్రాంతంలో 19.33 శాతం ప్రీమియంతో రూ. 940.45 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి..: Aug 31 Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్‌లో స్థిరంగా బంగారం, వెండి ధరలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *