అక్షరటుడే, వెబ్డెస్క్: Mandal Prajavani | ప్రజల సమస్యలను వారి చెంతకే వెళ్లి పరిష్కరించాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు ప్రతి సోమవారం మండల స్థాయిలోనూ మండల ప్రజా పరిషత్ (ఎంపీడీఓ) కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించనున్నట్లు నిజామాబాద్ Nizamabad జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
Mandal Prajavani | జిల్లా కేంద్రంలో యథావిధిగా..
మండల ప్రజలు తమ సమస్యలు, వినతులు, ఇతర దరఖాస్తులను ప్రతి సోమవారం మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణిలో సంబంధిత అధికారులకు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణి కూడా ప్రతీ సోమవారం యథావిధిగా కొనసాగుతుందని అన్నారు.
అయితే, ప్రజల సౌలభ్యం కోసం వారు వ్యయ ప్రయాసలకు గురి కాకూడదనే ఉద్దేశంతో ఇకపై మండల స్థాయిలోనూ ప్రజావాణి నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
Rupareddy Murder | ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య.. ఇది ఒక్క నేరం కాదు.. మనందరికీ ఒక హెచ్చరిక
ఆయా మండలాలకు చెందిన ప్రజలు తమ సమస్యలు, వినతులు సమర్పించేందుకు దూరం నుంచి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా, మండల అధికారులకు అర్జీలు అందించాలని సూచించారు.
Mandal Prajavani | ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
మండల స్థాయిలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని, ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని అన్నారు.
జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలు, వినతులు, దరఖాస్తులను మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో సమర్పించాలని కలెక్టర్ సూచించారు.