Nizamsagar CWC Visit | నిజాంసాగర్ పరీవాహక ప్రాంతాల్లో సీడబ్ల్యూసీ బృందం పర్యటన

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Nizamsagar CWC Visit | నిజాంసాగర్ ప్రాజెక్ట్ (Nizamsagar Project)​ పరీవాహక ప్రాంతంలో చౌడు, నీటి నిల్వ భూములను కేంద్ర జల సంఘం (CWC Team Visit) పరిశీలించింది. ఈ మేరకు నాగిరెడ్డిపేట్​, ఎల్లారెడ్డి మండలాల్లో బుధవారం పర్యటించింది.

Nizamsagar CWC Visit | చౌడు నేలలను ప్రత్యక్షంగా పరిశీలించి..

సెంట్రల్ వాటర్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ రూపేశ్, అసిస్టెంట్ డైరెక్టర్ సంజీవ్‌తో కూడిన బృందం నాగిరెడ్డిపేట (nagireddypet) మండలంలోని తాండూర్, మాటూర్, మాసాన్‌పల్లి గ్రామాలతో పాటు ఎల్లారెడ్డి మండలంలోని మత్తమాల, రుద్రారం గ్రామాల్లో పర్యటించింది. ప్రాజెక్టు ఫోర్‌షోర్ ప్రాంతంలో నీటి నిల్వ వల్ల భూములు చౌడుబారి పంటలకు పనికిరాకుండా పోతున్న తీరును ప్రత్యక్షంగా అధికారులు పరిశీలించారు. గ్రామాల్లో రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. నీటి నిల్వ కారణంగా భూగర్భ జలాలు ఉప్పగా మారాయని, భూసారం పూర్తిగా దెబ్బతిని దిగుబడులు తగ్గిపోయాయని రైతులు వాపోయారు. దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అధికారులకు విన్నవించారు.

Nizamsagar CWC Visit | క్షేత్రస్థాయిలో వాస్తవాలను నిర్ధారించేందుకు..

గతంలో ఇచ్చిన నివేదికల ఆధారంగా క్షేత్రస్థాయి వాస్తవాలను నిర్ధారించుకునేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. చౌడు ప్రభావిత భూముల విస్తీర్ణం, నష్టం తీవ్రత, డ్రెయినేజీ వ్యవస్థ పనితీరు వంటి అంశాలను నమోదు చేసుకున్నామన్నారు. సమస్య పరిష్కారానికి అవసరమైన సాంకేతిక నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని వెల్లడించారు. తనిఖీల్లో నీటి పారుదల శాఖ(Irrigation Department) డీఈఈ వెంకటేశ్వర్లు, ఏఈఈ అక్షయ్‌, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. అధికారుల బృందానికి స్థానిక అధికారులు సమస్యలను వివరించి, మ్యాప్​ల ద్వారా ప్రభావిత ప్రాంతాలను చూపించారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *