అక్షరటుడే వెబ్‌డెస్క్: ABHFL Berhampur Branch | ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన ‘ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్’ (ABHFL) తన సర్వీసులను మరింత విస్తరించింది. దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను పెంచుకునే ప్రణాళికలో భాగంగా ఒడిశాలోని బ్రహ్మపురంలో (Berhampur) నూతన శాఖను ప్రారంభించింది. ఈ కొత్త బ్రాంచ్‌తో కలిపి ఒడిశాలో కంపెనీ మొత్తం బ్రాంచ్‌ల సంఖ్య నాలుగుకు చేరింది.
ABHFL Berhampur Branch | హౌసింగ్ డిమాండ్..
దక్షిణ ఒడిశాలో ( Odisha ) కీలకమైన వాణిజ్య , విద్యా కేంద్రంగా ఉన్న బ్రహ్మపురంలో నగర విస్తరణ వేగంగా జరుగుతోంది. ఇక్కడ రిటైల్, సేవలు, వైద్యం, విద్య , చిన్న వ్యాపార రంగాలు అభివృద్ధి చెందుతుండటంతో.. ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు , స్వయం ఉపాధి పొందుతున్న వారిలో స్వంతిల్లు కల సాకారమవుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలకు సులభంగా హౌసింగ్ లోన్స్ అందించేందుకు ఈ కొత్త బ్రాంచ్ ఎంతగానో ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది.
ABHFL Berhampur Branch | వివిధ రకాల లోన్స్..
కస్టమర్ల అవసరాలకు తగినట్లుగా ABHFL అనేక రకాల ఆర్థిక పరిష్కారాలను అందిస్తోంది. అఫోర్డబుల్ హౌసింగ్, ప్రైమ్ హౌసింగ్, కన్‌స్ట్రక్షన్ ఫైనాన్స్ , ప్రాపర్టీపై లోన్‌లు (LAP) అందుబాటులో ఉన్నాయి. జీతం పొందే ఉద్యోగులు, స్వయం ఉపాధి నిపుణులు, వ్యాపారులు , వర్ధమాన ఆదాయ వర్గాల కోసం ఈ రుణాలు ప్రత్యేకంగా రూపొందించనున్నారు. బలమైన డిజిటల్ పద్ధతుల ద్వారా త్వరితగతిన లోన్ అప్రూవల్స్, సులభమైన ఆన్‌బోర్డింగ్ , పూర్తి పారదర్శకతను కల్పిస్తున్నారు.
ABHFL Berhampur Branch | ప్రత్యేక ఆఫర్లు..
ఈ నూతన బ్రాంచ్ ప్రారంభం సందర్భంగా కస్టమర్ల కోసం కంపెనీ ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. అక్టోబర్ 07 నుండి అక్టోబర్ 31, 2026 వరకు ఎలాంటి లాగిన్ ఫీజు (Zero Login Fees) లేకుండా లోన్ దరఖాస్తు చేసుకోవచ్చు . అంతేకాకుండా రూ. 50 లక్షల వరకు స్పాట్ లోన్ శాంక్షన్ల సౌకర్యం కల్పిస్తున్నారు. దీనివల్ల కస్టమర్లకు మరింత త్వరగా రుణాలు లభిస్తాయి.
ఈ విస్తరణ గురించి ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎండీ & సీఈఓ పంకజ్ గాడ్గిల్ మాట్లాడుతూ.. “ఒడిశా మాకు అత్యంత కీలకమైన వృద్ధి మార్కెట్. పెరుగుతున్న డిమాండ్‌కు తగినట్లుగా మా ప్రాంతీయ ఉనికిని చాటుకుంటున్నాము. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి కస్టమర్ల సొంతింటి కలను మరింత సులభంగా, వేగంగా నెరవేర్చడమే మా లక్ష్యం” అని తెలిపారు. ‘హ్యాపీ హోమ్ లోన్ జర్నీ’ అనే నినాదంతో కస్టమర్-సెంట్రిక్ విధానం ద్వారా మరింత మందికి ఆర్థిక సేవలను చేరువ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Dasara Special Buses | ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. దసరాకు 7 వేల స్పెషల్ బస్సులు