Mohan Bhagwat Speech | భారత్‌ను విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు.. ఆర్‌ఎస్‌ఎస్ విజయదశమి వేడుకల్లో భగవత్ హెచ్చరిక!

ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పట్ల ఆసక్తి, ప్రత్యేక గుర్తింపు రోజురోజుకూ పెరుగుతున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్సంఘచాలక్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Mohan Bhagwat Speech | ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పట్ల ఆసక్తి, ప్రత్యేక గుర్తింపు రోజురోజుకూ పెరుగుతున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్సంఘచాలక్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వైభవంగా జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ సాంప్రదాయ విజయదశమి ఉత్సవాల్లో పాల్గొని ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట వేగంగా విస్తరిస్తోందని, భారతదేశ అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రపంచ దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

Mohan Bhagwat Speech | ప్రపంచ సంక్షోభాలు..

పాశ్చాత్య దేశాల భౌతికవాదం, అనియంత్రిత వినియోగ సంస్కృతి , మితిమీరిన వ్యక్తివాదం సంపదను సృష్టించినప్పటికీ.. అవి తీవ్రమైన మానసిక, సామాజిక సంక్షోభాలకు కారణమవుతున్నాయని మోహన్ భగవత్ విశ్లేషించారు. ప్రస్తుతం ప్రపంచంలో భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి, పర్యావరణ విపత్తులు , ఆధిపత్య పోరాటాలు వినాశనానికి దారితీస్తున్నాయని హెచ్చరించారు. భిన్నత్వంతో కూడిన ప్రపంచాన్ని సమన్వయం చేయడం, పర్యావరణ పరిరక్షణతో అభివృద్ధిని సాధించడం , అందరినీ ఆదరించడం వంటి అంశాల్లో పలు దేశాలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఈ అన్ని అంతర్జాతీయ సమస్యలకు సనాతన జీవన దృక్పథం, సమగ్ర పరిష్కారాలు భారతదేశం వద్దే ఉన్నాయని ప్రపంచ సమాజం గుర్తిస్తోందని నొక్కిచెప్పారు.

Mohan Bhagwat Speech | కుట్రలపై హెచ్చరిక..

దేశంలో ‘పాలన మార్పు’ పేరుతో భారత్‌ను ( India )  విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని దుష్టశక్తులు కుట్రలు రచిస్తున్నాయని మోహన్ భగవత్ సంచలన ఆరోపణలు చేశారు. కేవలం అధికారం కోసం కొందరు రాజకీయ నాయకులు అల్లరి మూకలతో చేతులు కలుపుతున్నారని ధ్వజమెత్తారు. దేశాన్ని, హిందూ సమాజాన్ని, ఆర్‌ఎస్‌ఎస్‌ను బలహీనపరిచేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయని విమర్శించారు. మానవ విలువలను దెబ్బతీసేందుకు పశ్చిమ దేశాలలోని కొన్ని శక్తులు ప్రయత్నించడం వల్లే బంగ్లాదేశ్, నేపాల్, ఫ్రాన్స్, అల్బేనియా వంటి దేశాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ శక్తుల దృష్టి భారత్‌పై పడినప్పటికీ, ప్రభుత్వం , సమాజం అలాంటి ప్రయత్నాలను సమర్థవంతంగా అడ్డుకుంటాయని మోహన్ భగవత్ ధీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:  Padmanagar Durga Bhavani | పద్మానగర్‌లో వైభవంగా శ్రీ దుర్గా భవానీ శరన్నవరాత్రి ఉత్సవాలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *