అక్షరటుడే, వెబ్‌డెస్క్: IT Sector Selloff | పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు ముడిచమురు ధరలను అధిక స్థాయిలలో ఉంచుతున్నాయి. దీంతో ద్రవ్యోల్బణ భయాలతో మార్కెట్లు ఒత్తిడికి గురవుతున్నాయి. అమెరికా ఉద్యోగాల డేటా ఊహించిన దానికంటే మెరుగ్గా రావడంతో సెప్టెంబర్‌లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు జోరందుకున్నాయి. ఈ పరిణామాలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపడంతో సోమవారం స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ నష్టపోయాయి.
IT Sector Selloff | టెక్ స్టాక్స్‌లో సెల్లాఫ్..
అమెరికా వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలతో ఐటీ సెక్టార్ స్టాక్స్ ఒత్తిడికి గురయ్యాయి. ప్రధానంగా నష్టపోయిన వాటిలో ఇన్ఫోసిస్ , టీసీఎస్, టెక్ మహీంద్రా వంటి స్టాక్స్ ఉన్నాయి. ఇండెక్స్‌లలో భారీ వెయిటేజీ ఉన్న రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి స్టాక్స్ నెగెటివ్‌గా ఉండడం మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలలో ఒకటి.
IT Sector Selloff | నష్టాలతో మొదలై..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) సోమవారం నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 69 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మొదట్లో 31 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 507 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 14 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మొదట్లో 7 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 163 పాయిట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్ 382 పాయింట్ల నష్టంతో 76,132 వద్ద, నిఫ్టీ 118 పాయింట్ల నష్టంతో 23,779 వద్ద స్థిరపడ్డాయి.
IT Sector Selloff | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,010 కంపెనీలు లాభపడగా 2,474 స్టాక్స్ నష్టపోయాయి. 245 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 243 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 115 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 7 స్టాక్ లాభపడగా.. 13 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎల్టీ 0.61 శాతం, ఎయిర్‌టెల్ 0.60 శాతం, మారుతి 0.47 శాతం, పవర్‌గ్రిడ్ 0.36 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.35 శాతం లాభపడ్డాయి.
Top Losers : ఇన్ఫోసిస్ 3.81 శాతం, టెక్ మహీంద్రా 1.96 శాతం, టాటా స్టీల్ 1.85 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.57 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.41 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Crude Oil Prices | క్రూడ్ ఆయిల్ ధరలు పైపైకి.. నష్టాల బాటలో స్టాక్ మార్కెట్