Stock Market Losses | నష్టాలతో ముగిసిన సూచీలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Losses | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) గురువారం లాభాలతో ప్రారంభమై భారీ లాభాల దిశగా సాగినా.. కొద్దిసేపటికే ప్రాఫిట్ బుకింగ్‌ను చూసింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభిస్తుండగా.. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు ప్రాధాన్యత ఇస్తుండడంతో చివరికి సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. రూపాయిని స్థీరీకరించడానికి ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచడంతో సహా వివిధ చర్యలను పరిశీలిస్తోందన్న వార్తలతో ప్రారంభ లాభాలు ఆవిరయ్యాయి.

Stock Market Losses | లాభాలతో ప్రారంభమై నష్టాల్లోకి..

సెన్సెక్స్ ఉదయం 414 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 213 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 949 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 171 పాయింట్ల లాభంతో ప్రారంభమె మరో 29 పాయింట్లు ఎగబాకింది. అక్కడినుంచి 263 పాయింట్లు పడిపోయింది. చివరికి సెన్సెక్స్ 135 పాయింట్ల నష్టంతో 75,183 వద్ద, నిఫ్టీ 4 పాయింట్ల నష్టంతో 23,654 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Losses | మిక్స్‌డ్ గా సూచీలు..

నిఫ్టీ (Nifty)లో టెలికాం, క్యాపిటల్ గూడ్స్, పవర్ 0.98 శాతం, రియాలిటీ, ఆటో రంగాలు లాభపడగా.. ఎఫ్ ఎంసీజీ, మీడియా, యుటిలిటీ, ఐటీ, బ్యాంకింగ్ రంగాల షేర్లు నష్టపోయాయి.

Stock Market Losses | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,426 కంపెనీలు లాభపడగా 1,745 స్టాక్స్ నష్టపోయాయి. 191 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 124 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 39 కంపెనీలు 56 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 13 స్టాక్ లాభపడగా.. 17 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఇండిగో 3.16 శాతం, బీఈఎల్ 1.77 శాతం, ట్రెంట్ 1.75 శాతం, అదానీ పోర్ట్స్ 1.12 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.95 శాతం లాభపడ్డాయి.

Top Losers : బజాజ్ ఫైనాన్స్ 1.74 శాతం, టెక్ మహీంద్రా 1.44 శాతం, హెచ్యూఎల్ 1.37 శాతం, ఇన్ఫోసిస్ 1.27 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.25 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: RBI Recovery Rules|రికవరీ ఏజెంట్లకు ఆర్‌బీఐ కొత్త రూల్స్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *