Trump Iran Ceasefire | ఇరాన్‌తో చర్చలకు అమెరికా అంగీకారం..’కాల్పుల విరమణ ముగిసింది’ అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump Iran Ceasefire | ఇరాన్‌తో సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ తమతో చర్చలు కొనసాగించాలని కోరిందని, అందుకు అమెరికా అంగీకరించిందని ట్రంప్ వెల్లడించారు. అయితే, కాల్పుల విరమణ (Ceasefire) ఇక ముగిసిందని అమెరికా ఇరాన్‌కు స్పష్టంగా తెలియజేసినట్లు పేర్కొన్నారు.

DSP Bheem Reddy | డీఎస్పీ భీంరెడ్డి డైరీలో కొత్త వివరాలు.. టాలీవుడ్ హీరో పేరు వెలుగులోకి?

Trump Iran Ceasefire | అంతర్జాతీయ స్థాయిలో మరోసారి చర్చకు

తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్​లో ట్రంప్ చేసిన పోస్టులో, “ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మాతో చర్చలు కొనసాగించాలని కోరింది. అందుకు మేము అంగీకరించాం. అయితే కాల్పుల విరమణ ముగిసిందని ఎలాంటి సందేహం లేకుండా వారికి స్పష్టం చేశాం” అని పేర్కొన్నారు.

ట్రంప్ తాజా వ్యాఖ్యలు అమెరికా–ఇరాన్ సంబంధాలపై అంతర్జాతీయ స్థాయిలో మరోసారి చర్చకు దారితీశాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఒకవైపు దౌత్యపరమైన చర్చలకు అవకాశం కల్పిస్తూనే, మరోవైపు అమెరికా తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ట్రంప్ సంకేతాలు ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. ఈ పరిణామాలు మధ్యప్రాచ్య ప్రాంత భద్రతా పరిస్థితులు, అంతర్జాతీయ దౌత్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశముందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *