Stock Market | రోజంతా ఒడిదుడుకులు.. స్వల్ప నష్టాల్లో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ రోజంతా ఒడిదుడుకుల మధ్య సాగింది. చివరికి సెన్సెక్స్ 70 పాయింట్లు, నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో ముగిశాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | పశ్చిమాసియాలో సంక్షోభం, అమెరికా, ఇరాన్‌ల మధ్య నిరంతర సంఘర్షణల నేపథ్యంలో ద్రవ్యోల్బణ భయాలు మార్కెట్‌ను వెన్నాడుతున్నాయి. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కఠిన వైఖరిని కొనసాగించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరల్లో అస్థిరత కారణంగా ప్రధానంగా ఆసియా మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు.

Stock Market | ఫ్లాట్ గా ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) మంగళవారం ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైంది. సెన్సెక్స్ 4 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 126 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి 283 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 9 పాయింట్లు తగ్గింది. ఇంట్రాడే కనిష్టాలనుంచి 79 పాయింట్లు ఎగబాకింది. చివరికి సెన్సెక్స్ 70 పాయింట్ల లాభంతో 76,765 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 23,985 వద్ద స్థిరపడ్డాయి.

అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,626 కంపెనీలు లాభపడగా 2,629 స్టాక్స్ నష్టపోయాయి. 169 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 109 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 84 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 17 స్టాక్ లాభపడగా.. 13 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టీసీఎస్ 4.47 శాతం, ఎటర్నల్ 4.02 శాతం, టెక్ మహీంద్రా 3.86 శాతం, ఇన్ఫోసిస్ 2.47 శాతం, టైటాన్ 2.44 శాతం లాభపడ్డాయి.

Top Losers : హెచ్యూఎల్ 6.97 శాతం, బీఈఎల్ 4.41 శాతం, ఎన్టీపీసీ 1.95 శాతం, పవర్‌గ్రిడ్ 1.25 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.20 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Stock Market | నష్టాల్లో దేశీయ స్టాక్​ మార్కెట్లు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *