April 20 Market Analysis | లాభాల్లో ఆసియా మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

Naresh Chandan
April 20 Market Analysis

అక్షరటుడే, వెబ్​డెస్క్​: April 20 Market Analysis | హార్మూజ్ జలసంధి(Strait of Hormuz)ని మళ్లీ మూసి వేశారని, ఓడలపై ఇరాన్, అమెరికా పరస్పరం దాడులు చేసుకున్నాయన్న వార్తల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధర మళ్లీ పెరిగింది. అయితే సోమవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు పాజిటివ్‌గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ లాభాలతో ఉండడంతో మన మార్కెట్ గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

April 20 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత వారాంతపు సెషన్‌లో యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగిసినా.. వారాంతంలో అమెరికా, ఇరాన్‌ల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం, హార్మూజ్ జలసంధి తెరిచే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతుండడంతో సోమవారం ఉదయం యూఎస్ ఫ్యూచర్స్ నష్టాలతో ఉన్నాయి. గత సెషన్‌లో నాస్‌డాక్(Nasdaq) 1.52 శాతం, ఎస్ అండ్ పీ 1.20 శాతం లాభపడగా.. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.74 శాతం నష్టంతో ఉంది.stock market

April 20 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 2.22 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.93 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.73 శాతం లాభపడ్డాయి.

April 20 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు లాభంతో సాగుతున్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 1.30 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.21 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.02 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.92 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.63 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.01 శాతం లాభంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) 0.20 శాతం లాభంతో ఉంది. దీంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

market
market

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు వరుసగా మూడో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 683 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • డీఐఐలు వరుసగా మూడో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 4,721 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.98 నుంచి 1.09 కు పెరిగింది.
  • విక్స్ 4.87 శాతం తగ్గి 17.2 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 98.30 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.27 వద్ద ఉన్నాయి.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 94.74 డాలర్ల వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 29 పైసలు బలపడి 92.92 వద్ద ఉంది.

 

ఇది కూడా చదవండి: April 20 Gold Rates | అక్షయ తృతీయ వేళ.. బంగారం కొనుగోలుదారుల్లో మిశ్రమ స్పందన

ఇది కూడా చదవండి: Akshaya Tritiya | అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులు.. ఇవి ఇంట్లో ఉంటే సిరిసంపదలే!

ఇది కూడా చదవండి: KCR Jagtial Sabha | గులాబీ బాస్ ఆగమనం.. 20న జగిత్యాలలో బహిరంగ సభ.. బీఆర్ఎస్ కు పూర్వ వైభవం వచ్చేనా!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *