Instagram Apple TV App | ఇన్‌స్టాగ్రామ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఇకపై పెద్ద టీవీ స్క్రీన్‌పై రీల్స్ చూడొచ్చు

స్మార్ట్‌ఫోన్‌ల చిన్న స్క్రీన్‌పై మాత్రమే చూసే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను ఇకపై ఇంట్లోని పెద్ద టీవీ స్క్రీన్‌పై హాయిగా వీక్షించవచ్చు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Instagram Apple TV App | స్మార్ట్‌ఫోన్‌ల చిన్న స్క్రీన్‌పై మాత్రమే చూసే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను ఇకపై ఇంట్లోని పెద్ద టీవీ స్క్రీన్‌పై హాయిగా వీక్షించవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ‘యాపిల్ టీవీ’ (Apple TV) యాప్ అందుబాటులోకి వచ్చింది. అక్టోబర్ 23 నుంచి ఈ యాప్ యాపిల్ టీవీ యాప్ స్టోర్‌లో ఉచితంగా లభిస్తోంది. భారత్‌తో సహా గ్లోబల్ యూజర్లకు ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.

Instagram Apple TV App | టీవీలో రీల్స్, లైవ్ షోలు..

ఇన్నాళ్లూ ఫోన్‌లో ఒక్కరమే రీల్స్ చూస్తూ సమయాన్ని గడిపేవాళ్ళం. అయితే ఈ అనుభవాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పంచుకునే డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మార్చడమే లక్ష్యంగా ఈ యాప్‌ను రూపొందించారు. గతంలో కొన్ని స్మార్ట్ టీవీల్లో కేవలం రీల్స్ మాత్రమే వచ్చేవి. కానీ, యాపిల్ టీవీ కోసం తెచ్చిన ఈ కొత్త వెర్షన్‌లో రీల్స్‌తో పాటు లాంగ్ వీడియోలు, లైవ్ బ్రాడ్‌కాస్ట్‌లు కూడా రిమోట్‌తో ఆపరేట్ చేస్తూ చూడవచ్చు.

Instagram Apple TV App | క్రాస్ డివైజ్ కంటిన్యూటీ ఫీచర్..

ఈ యాప్‌లో ‘క్రాస్ డివైజ్ కంటిన్యూటీ’ (Cross-Device Continuity) అనే ఆసక్తికరమైన ఫీచర్‌ను అందించారు. దీని సహాయంతో ప్రయాణంలో ఉన్నప్పుడు మీ ఫోన్‌లో సగం చూసి ఆపేసిన వీడియోను, ఇంటికి వచ్చాక యాపిల్ టీవీలో మీరు ఎక్కడైతే ఆపారో సరిగ్గా ఆ పాయింట్ నుంచే కంటిన్యూ చేసి చూడవచ్చు.

Instagram Apple TV App | పాత యాపిల్ టీవీ డివైజ్..

ఈ యాప్‌ను ఉపయోగించడానికి కొత్తగా మార్కెట్లోకి రాబోతున్న నాలుగో జనరేషన్ యాపిల్ టీవీ 4 కే పరికరాన్ని కొనాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మీ వద్ద ఉన్న పాత యాపిల్ టీవీ హెచ్‌డీ (Apple TV HD) లేదా యాపిల్ టీవీ 4 కే (Apple TV 4K) పరికరాల్లోనే ఇది పనిచేస్తుంది. కాకపోతే మీ డివైజ్ ‘tvOS 26.0’ లేదా ఆ తదుపరి సాఫ్ట్‌వేర్ వెర్షన్‌పై రన్ అవుతుందో లేదో సరిచూసుకోవాలి.

అమెజాన్  ( Amazon  )ఫైర్ టీవీ, గూగుల్ టీవీ, శామ్‌సంగ్ స్మార్ట్ టీవీల్లో విజయవంతమైన ప్రయోగాల తర్వాత ఇప్పుడు యాపిల్ టీవీ యూజర్లకు కూడా ఈ యాప్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చారు. టీవీలోని యాప్ స్టోర్‌లోకి వెళ్లి ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకుని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌తో లాగిన్ అయి బిగ్ స్క్రీన్ వినోదాన్ని ఆస్వాదించవచ్చు.

ఇది కూడా చదవండి:  Prajavani Rajanna Sircilla | ప్రజావాణితో సమస్యల పరిష్కారం..: కలెక్టర్ గరిమ అగ్రవాల్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *