Akshaya Tritiya | అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులు.. ఇవి ఇంట్లో ఉంటే సిరిసంపదలే!

Naresh Chandan
Akshaya Tritiya

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Akshaya Tritiya | భారతీయ సంస్కృతిలో అక్షయ తృతీయకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ‘అక్షయ’ అంటే తరగనిది అని అర్థం. ఈ రోజున ఏ పని చేసినా, ఏ వస్తువు కొన్నా అది వృద్ధి చెందుతుందని భక్తుల నమ్మకం.

అయితే, ఆకాశాన్ని తాకుతున్న పసిడి ధరల వల్ల సామాన్యులకు బంగారం కొనడం భారంగా మారింది. కానీ, మన పురాణాల ప్రకారం పసిడికి ప్రత్యామ్నాయంగా వెండి, వంటపాత్రలు, ధాన్యాలు కొనుగోలు చేసినా అంతే పుణ్యఫలం దక్కుతుంది.

April 19 Gold Rates

Akshaya Tritiya | వెండి :

బంగారం తర్వాత అత్యంత శుభప్రదమైన లోహం వెండి. వెండిని చంద్రుడికి ప్రతీకగా భావిస్తారు. అక్షయ తృతీయ నాడు వెండి నాణేలు, పూజా సామాగ్రి లేదా కనీసం ఒక చిన్న వెండి గిన్నె కొనుగోలు చేసినా ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. ఇది కుటుంబంలో శాంతిని, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందని నమ్మకం.

Akshaya Tritiya | వంటగది పాత్రలు :

మన సంప్రదాయంలో వంటగదిని ‘అన్నపూర్ణేశ్వరి’ నిలయంగా భావిస్తారు. అందుకే ఈ పవిత్ర రోజున ఇత్తడి, రాగి లేదా కంచుతో చేసిన కొత్త పాత్రలను కొనుగోలు చేయడం చాలా మంచిది. కొత్త పాత్రలు ఇంట్లోకి రావడం వల్ల కుటుంబానికి నిరంతర పోషణ, ఆర్థిక శ్రేయస్సు లభిస్తాయని పెద్దలు చెబుతుంటారు.

akshara today .jpggrain

Akshaya Tritiya | ధాన్యాలు :

సంపద అంటే కేవలం డబ్బు, నగలే కాదు.. తినే ఆహారం కూడా సంపదే. అక్షయ తృతీయ నాడు బార్లీ గింజలు లేదా బియ్యం కొనుగోలు చేయడం అత్యంత శుభప్రదం. బార్లీని పసిడితో సమానంగా చూస్తారు. ఇది సంతానోత్పత్తిని, జీవితంలో ఎదుగుదలను సూచిస్తుంది.

ప్రాపర్టీ లేదా భూమి:

దీర్ఘకాలిక పెట్టుబడులకు అక్షయ తృతీయ ఒక అద్భుతమైన ముహూర్తం. కొత్త ఇల్లు కొనాలన్నా లేదా స్థలం రిజిస్ట్రేషన్ చేయాలన్నా ఈ రోజును ‘స్వయం సిద్ధ ముహూర్తం’గా పరిగణిస్తారు. ఈ రోజున ఆస్తులపై పెట్టే పెట్టుబడి భవిష్యత్తులో మంచి వృద్ధిని ఇస్తుంది.

మట్టి కుండలు:

వింతగా అనిపించినా, అక్షయ తృతీయ నాడు మట్టి కుండను కొనడం వెనుక ఒక గొప్ప అర్థం ఉంది. మట్టి కుండ స్థిరత్వానికి, సరళమైన జీవనానికి నిదర్శనం. కొత్త మట్టి కుండలో నీరు నింపి దానం చేయడం లేదా ఇంట్లో ఉంచుకోవడం వల్ల జీవితంలో సమతుల్యత ఏర్పడుతుందని నమ్మకం.

వాహనాలు :

జీవిత ప్రయాణంలో ముందుకు సాగడానికి, పురోగతి సాధించడానికి వాహనం ఒక ప్రతీక. అందుకే చాలా మంది ఈ రోజున కారు లేదా బైక్ వంటి వాహనాలను కొనుగోలు చేస్తుంటారు. ఈ రోజున చేసే వాహన పూజ వల్ల ప్రయాణాలు సురక్షితంగా సాగుతాయని భక్తుల విశ్వాసం.

ఇది కూడా చదవండి: KCR Jagtial Sabha | గులాబీ బాస్ ఆగమనం.. 20న జగిత్యాలలో బహిరంగ సభ.. బీఆర్ఎస్ కు పూర్వ వైభవం వచ్చేనా!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *