అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Stock Market | పశ్చిమాసియా(West asia)లో ఉద్రిక్తతలు కొనసాగుతుండడం, ప్రైమరీ మార్కెట్ యాక్టివ్‌గా ఉండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అయితే ముడిచమురు ధరలు దిగివస్తుండడం, రూపాయి(Rupee) స్వల్పంగా బలోపేతం కావడంతో కనిష్టాల వద్ద కొనుగోళ్లకు మద్దతుగా నిలుస్తుండడంతో మార్కెట్లు స్వల్ప లాభాలతో ఉన్నాయి. టెక్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది.
Indian Stock Market | గ్యాప్ అప్ లో ప్రారంభం..
దేశీయ మార్కెట్లు (Domestic Markets) శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 261 పాయింట్ల గ్యాప్ అప్‌లో ప్రారంభమై మరో 18 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 218 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 26 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల వద్ద లాభాల స్వీకరణతో 74 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 159 పాయింట్ల లాభంతో 74,473 వద్ద, నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో 23,319 వద్ద ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 14 స్టాక్స్ లాభాలతో, 16 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్ 1.79 శాతం, ఇండిగో 1.59 శాతం, అదానీ పోర్ట్స్ 1.41 శాతం, హ్డెఎఫ్సీ బ్యాంక్ 1.34 శాతం, ఎటర్నల్ 1.05 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : టీసీఎస్ 3.02 శాతం, టైటాన్ 1.48 శాతం, టెక్ మహీంద్రా 1.42 శాతం, హెచ్సీఎల్ టెక్ 1.41 శాతం, మారుతి 1.38 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Sep 18 Market Analysis | గ్రీన్‌లో గ్లోబల్ క్యూస్..ఫ్లాట్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ