KTR Revanth Reddy | సీఎం రేవంత్​రెడ్డికి కేటీఆర్​ ఆఫర్​

తమకు రూ.లక్ష కోట్ల ఆస్తులు ఉన్నాయన్న ప్రచారంపై కేటీఆర్​ స్పందించారు. రేవంత్​రెడ్డి రూ. వెయ్యి కోట్లు ఇస్తే.. ఆస్తులు అన్ని ఇస్తామని ఆఫర్​ ఇచ్చారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR Revanth Reddy | బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)కి ఆఫర్​ ఇచ్చారు. తాము రూ.లక్ష కోట్లు కొల్లగొట్టామని చెబుతున్న సీఎం.. తమకు రూ.వెయ్యి కోట్లు ఇస్తే మొత్తం రాసిస్తామన్నారు.

ఫార్ములా ఈ కారు రేసు విచారణ కోసం కేటీఆర్​ శుక్రవారం ఉదయం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కోర్టు విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ రేవంత్‌కు మంచి ఆఫర్ ఇస్తున్నా.. మాకు వెయ్యి కోట్లు ఇస్తే మొత్తం ఇచ్చేస్తాం.. మిగిలిన 99 వేల కోట్లు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలకోసం ఖర్చు చెయ్యండి” అని కేటీఆర్​ అన్నారు. కాళేశ్వరంలో లక్ష కోట్లని ప్రచారం చేసినట్లుగానే ఇప్పుడు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

KTR Revanth Reddy | అక్రమ కేసులతో..

కేసీఆర్​తో పాటు బీఆర్​ఎస్​ నాయకులను ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. కక్ష సాధింపులకు పాల్పడుతోందని కేటీఆర్​ విమర్శించారు. అధికారంలోకి రాగానే మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, నిరుద్యోగ భృతి అమలు చేస్తామని చెప్పారన్నారు. అవి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు పేరుకుపోయి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కాలేజీలు మూతబడే పరిస్థితి ఉందన్నారు.

KTR Revanth Reddy | కోర్టులపై నమ్మకం ఉంది

వ్యవసాయానికి సరిపడ కరెంట్​ లేక రైతులు సబ్ స్టేషన్​ల ఎదుట ధర్నాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా తమ కుటుంబంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు, హైదరాబాద్​ నగరానికి పేరు తెచ్చేందుకు తాను ఫార్ములా ఈ రేసును నగరంలో నిర్వహించానని చెప్పారు. అయితే అందులో ఏదో జరిగిపోయినట్లు తనపై కేసు పెట్టారన్నారు. దీనిని తాము ఎదుర్కొంటామని చెప్పారు. న్యాయస్థానాలపై తమకు విశ్వాసం ఉందన్నారు. కోర్టు ఎప్పుడు పిలిచినా వస్తానని తెలిపారు.

ఇది కూడా చదవండి..: PMAY Rural Houses | రాష్ట్రానికి రెండు లక్షలు ఇళ్లు కేటాయించిన కేంద్రం.. సీఎం కృతజ్ఞతలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *