అక్షరటుడే, వెబ్డెస్క్: Aug 27 Horoscope | ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితి ఆధారంగా నేడు (గురువారం, ఆగస్టు 27) మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొందరికి ఆకస్మిక ధనలాభాలు, ఉద్యోగంలో ప్రోత్సాహం, వ్యాపారంలో ఊహించని విజయాలు లభించే అవకాశం ఉండగా… మరికొందరికి ఖర్చులు పెరగడం, ఆరోగ్య సమస్యలు, ప్రయాణాలలో చిన్నపాటి ఇబ్బందులు ఎదురుకావచ్చు.
Aug 27 Horoscope | రాశుల వారీగా..
మేష రాశి: Aug 27 Horoscope | ఉద్యోగంలో మీకు ప్రాధాన్యతతో పాటు ఉన్నతాధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో అనుకోని ధనలాభం ఉంటుంది. సమాజంలో ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
బంధువుల నుండి రావాల్సిన బాకీలు అందుతాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు దక్కుతాయి. పిల్లల భవిష్యత్తుపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.
వృషభ రాశి: Aug 27 Horoscope | సుదీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆర్థికంగా అనుకూలమైన రోజు. మహిళలకు అన్ని రంగాల్లో కలిసివస్తుంది. విదేశాల నుండి శుభవార్తలు వింటారు.
స్నేహితుల నుండి సహాయం లభిస్తుంది. ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. వైద్య ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి.
మిథున రాశి: Aug 27 Horoscope | రోజు ప్రారంభంలోనే శుభవార్త వింటారు. పాత పెట్టుబడుల నుండి మంచి లాభాలు అందుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో పదోన్నతి లేదా అధికార యోగం సూచిస్తోంది.
జీవిత భాగస్వామితో కలిసి ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధువులతో ఉన్న ఆస్తి తగాదాలు తీరతాయి. వ్యాపారంలో ఒత్తిడి ఉన్నా లాభాలు బాగుంటాయి. అకస్మాత్తుగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.
కర్కాటక రాశి: Aug 27 Horoscope | ఆర్థిక ఇబ్బందులు తొలగి ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు లభిస్తాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త ప్రణాళికలు వేస్తారు. పిల్లలు చదువుల్లో రాణిస్తారు. వైవాహిక జీవితం హాయిగా సాగుతుంది. డాక్టర్లు, లాయర్లకు అనుకూల సమయం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి.
సింహ రాశి: Aug 27 Horoscope | సొంత సమస్యలు, స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. దాంపత్య జీవితంలో అనుకూల మార్పులు వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో కీర్తిప్రతిష్ఠలు, పలుకుబడి పెరుగుతాయి. చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. మీ సలహాలకు కుటుంబంలో ప్రశంసలు దక్కుతాయి. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ అవసరం.
కన్యా రాశి: Aug 27 Horoscope | ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెడతారు. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తవుతాయి. వృత్తిపరంగా శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. అయితే ఆర్థిక లావాదేవీలు, తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు రావచ్చు.
తులా రాశి: Aug 27 Horoscope | ఒత్తిడి, అలసట వల్ల ఇబ్బంది పడతారు. ఆర్థిక విషయాలు ఆందోళన కలిగిస్తాయి. బద్ధకం వల్ల పనులు ఆగిపోయే ప్రమాదం ఉంది. కొత్త పనులు ప్రారంభించకపోవడం శ్రేయస్కరం. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ధ్యానం చేయడం వల్ల ప్రశాంతత లభిస్తుంది. సాయంత్రం వేళ మిత్రులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు.
వృశ్చిక రాశి: Aug 27 Horoscope | వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. ఉద్యోగంలో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దంపతుల నడుమ మనస్పర్థలు రాకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్య సమస్యలు, కోర్టు వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తగవు.
ధనస్సు రాశి: ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. విదేశాల నుండి శుభవార్తలు అందుతాయి. పెట్టుబడుల నుంచి మంచి లాభాలను పొందుతారు. సామాజిక సేవలో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు ఆనందాన్ని ఇస్తాయి. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. పెద్దవారితో మాట్లాడేటప్పుడు సంయమనం వహించాలి.
మకర రాశి: ఇవాళ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు అందుతాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. ఉద్యోగంలో తగిన గుర్తింపు లభిస్తుంది. పెండింగ్ పనులు పూర్తి కావడంతో పాటు అనుకోని అతిథుల రాకతో ఇల్లు సంతోషంగా ఉంటుంది. వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఖర్చులు అధికంగా ఉంటాయి.
కుంభ రాశి: పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూల సమయం. చాలా కాలంగా కొనాలనుకుంటున్న విలువైన వస్తువును కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. మీరు చేసే మంచి పనుల వల్ల పేరుప్రఖ్యాతలు, కొత్త పరిచయాలు పెరుగుతాయి. పిల్లల విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మంచిది.
మీన రాశి: గత పెట్టుబడుల నుండి ఆదాయం లభిస్తుంది. ఆస్తికి సంబంధించిన పేపర్ వర్క్ ఇబ్బందులు తొలగిపోతాయి. స్నేహితులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో బంధువుల వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు. పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు కాస్త శ్రమతో కూడిన సమయం. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.