CM Revanth Reddy Meeting | నేడు ప్రభుత్వ విప్​లతో సీఎం సమావేశం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Revanth Reddy Meeting | సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శనివారం సాయంత్రం 4:30 గంటలకు ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో తొలిసారిగా ప్రభుత్వ విప్‌లతో సమావేశం కానున్నారు. వారికి బాధ్యతలు అప్పగించి విపక్ష విమర్శలకు సమర్థంగా కౌంటర్ ఇవ్వాలని దిశానిర్దేశం చేయనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం (State Government) మార్చిలో పలువురిని ప్రభుత్వ విప్​లుగా నియమించిన విషయం తెలిసిందే. శాసన సభ విప్​లుగా ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్​రెడ్డి, విజయ రమణారావు, వేముల వీరేశంను, శాసన మండలి విప్​లుగా బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్​ను నియమించింది. వారితో సీఎం తొలిసారి సమావేశం కానున్నారు. ఇటీవల ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విమర్శల జోరు పెంచాయి. బీఆర్​ఎస్​, బీజేపీతో పాటు కవిత ఏర్పాటు చేసిన టీఆర్​ఎస్ కాంగ్రెస్​ను టార్గెట్​ చేశాయి.

CM Revanth Reddy Meeting | ధీటుగా ఎదుర్కోవాలి

ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. అలాగే రైతు భరోసా (Rythu Bharosa), ఆర్టీసీ వీలినం తదితర సమస్యలపై ప్రశ్నిస్తున్నాయి. ప్రతిపక్షాల విమర్శలకు మంత్రులు సమాధానం చెబుతున్నారు. ప్రభుత్వ విప్​లు సైతం కౌంటర్​ ఇస్తున్నారు. అయితే మరింత ధీటుగా ప్రతిపక్షాలను ఎదుర్కోవాలని సీఎం విప్​లకు మార్గనిర్దేశం చేయనున్నారు.

ఇది కూడా చదవండి..: Government Employee | పీఆర్సీ అమలు చేస్తాం.. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో డిప్యూటీ సీఎం భేటీ!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *