North Korea Nuclear|కిమ్ మరణిస్తే అణు బాంబులే.. ఉత్తర కొరియా సంచలన నిర్ణయం

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:North Korea Nuclear|ఉత్తర కొరియా తన అణ్వాయుధ విధానంలో అనూహ్య మార్పులు చేసింది. కిమ్ జోంగ్ ఉన్ ప్రాణాలకు ముప్పు వాటిల్లితే, తక్షణమే శత్రువులపై అణుదాడులు చేసేలా ఉత్తర కొరియా తన రాజ్యాంగాన్ని సవరించింది. దక్షిణ కొరియా నిఘా సంస్థ (NIS) అందించిన సమాచారం ప్రకారం ఈ కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

North Korea Nuclear|ఇరాన్ ఘటనతో అప్రమత్తం..

ఇటీవల ఇజ్రాయెల్ , అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత ఖమేనీతో పాటు పలువురు అగ్రనేతలు మరణించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను నిశితంగా గమనించిన కిమ్ జోంగ్ ఉన్, తన భద్రత విషయంలో మరింత కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. శత్రు దేశాలు తనను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తే, ఆ దాడులే వారి వినాశనానికి దారితీసేలా కొత్త నిబంధనలను రూపొందించారు.

North Korea Nuclear|కొత్త అణు విధానం ..

ఇటీవల జరిగిన 15వ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ సమావేశంలో ఈ రాజ్యాంగ సవరణకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. దేశ అణ్వాయుధాలపై పూర్తి నియంత్రణ కిమ్ వద్దే ఉంటుంది. ఒకవేళ యుద్ధం లేదా ఇతర దాడుల్లో కిమ్ మరణిస్తే, ఎవరి అనుమతితో సంబంధం లేకుండా అణ్వాయుధ వ్యవస్థలు స్వయంచాలకంగా శత్రువులపై దాడులు చేస్తాయి. ఈ సంవత్సరం చివరి నాటికి దక్షిణ కొరియా సరిహద్దు వెంబడి భారీ శ్రేణి క్షిపణి వ్యవస్థలను మోహరించాలని ఉత్తర కొరియా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

North Korea Nuclear|దక్షిణ కొరియా ఆందోళన..

ఉత్తర కొరియా తీసుకుంటున్న ఈ చర్యలను దక్షిణ కొరియాకు చెందిన నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ (NIS) ధృవీకరించింది. కిమ్ తీసుకున్న ఈ ‘డెడ్ హ్యాండ్’ పాలసీ (అధినేత మరణిస్తే అణుదాడులు చేయడం) కొరియా ద్వీపకల్పంలో మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Vijay Tamil Nadu|మేజిక్ ఫిగర్ దాటేసిన టీవీకే.. సీఎం పీఠం దిశగా దళపతి!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *