Tamil Nadu Hung Assembly | అన్నా డీఎంకే – డీఎంకే చర్చలు..! ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్రత్యర్థులు?

Naresh Chandan
Tamil Nadu Hung Assembly

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tamil Nadu Hung Assembly | తమిళనాడు రాజకీయాల్లో మళ్లీ ఊహాగానాల హోరు మొదలైంది. సంప్రదాయంగా ప్రత్యర్థులుగా నిలిచిన అన్నా డీఎంకే (AIADMK), డీఎంకే (DMK) మధ్య “సంభాషణలు జరుగుతున్నాయా?” అన్న చర్చలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

మరోవైపు అత్యధిక సీట్లు సాధించిన టీవీకే అధినేత, తమిళనాడులో రాజకీయ ప్రభంజనం సృష్టించిన విజయ్​ ప్రమాణ స్వీకారం రద్దు అయింది. ప్రమాణ స్వీకారానికి ముందే మ్యాజిక్​ ఫిగర్​ చూపించాలని గవర్నర్​ స్పష్టం చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇదే సమయంలో అతని ప్రత్యర్థులు ఏకతాటిపైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డీఎంకే, అన్నాడీఎంకే మధ్య ప్రభుత్వం ఏర్పాటు దిశగా చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Tamil Nadu Hung Assembly | మ్యాజిక్​ ఫిగర్​ లేకపోవడంతో

దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల ఆధిపత్యానికి చెక్ పెడుతూ సినీ నటుడు విజయ్ తన తమిళగ వెట్రి కళగం (TVK) ద్వారా రాజకీయ భూకంపాన్ని సృష్టించారు. కానీ ప్రభుత్వం ఏర్పాటుకు కావల్సిన మ్యాజిక్​ ఫిగర్​ లేకపోవడంతో కాంగ్రెస్​, కమ్యూనిస్టు పార్టీల మద్దతు కోరినట్లు తెలుస్తోంది.

కాగా, దశాబ్దాల ఆధిపత్యం చేజారిపోకుండా ఉండేందుకు ప్రత్యర్థ పార్టీలు ఏకం అవుతున్నట్లు ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో అన్నా డీఎంకే (AIADMK), డీఎంకే (DMK) కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలపై వస్తున్న వార్తలు ఎంతవరకు నిజం? రాజకీయ గణాంకాలు ఏమి చెబుతున్నాయి? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రధానంగా మారాయి.

Tamil Nadu Hung Assembly | ఎన్నికల ఫలితాలు ఇలా..

తమిళనాడులో 2026 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం, రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పు సంభవించింది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) అత్యధిక స్థానాలు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది.

మొత్తం 234 స్థానాలకు గాను పార్టీల వారీగా గెలిచిన స్థానాల వివరాలు..

పార్టీ – గెలిచిన స్థానాలు

తమిళగ వెట్రి కళగం (TVK) – 108

ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) – 59

ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) – 47

భారత జాతీయ కాంగ్రెస్ (INC) – 5

పట్టాలి మక్కల్ కట్చి (PMK) – 4

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) – 2

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (Marxist) – 2

విదుతలై చిరుతైగల్ కట్చి (VCK) – 2

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) – 2

భారతీయ జనతా పార్టీ (BJP) – 1

దేశీయ ముర్పొక్కు ద్రావిడ కజగం (DMDK) – 1

అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (AMMK) – 1

మేజిక్ ఫిగర్: ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీ మార్కు 118. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో తమిళనాడులో ‘హంగ్’ ఏర్పడింది.

TVK ప్రభంజనం: విజయ్ పార్టీ 108 స్థానాలు సాధించింది. విజయ్ స్వయంగా రెండు చోట్ల (పెరంబూర్ – తిరుచ్చి ఈస్ట్) పోటీ చేసి విజయం సాధించారు. కానీ, ఒకచోట స్థానాన్ని వదులుకోవాల్సి ఉండనున్న నేపథ్యంలో టీవీకే చేతిలో 107 స్థానాలు ఉన్నట్లు. కాంగ్రెస్​ మద్దతుతో ఆ సంఖ్య 112కు చేరుకుంది. ప్రభుత్వం ఏర్పాటుకు ఇంకా ఆరుగురి సభ్యుల మద్దతు అవసరం

Tamil Nadu Hung Assembly | ద్రవిడ పార్టీల వెనుకబాటు

గత 50 ఏళ్లుగా రాష్ట్రాన్ని ఏలుతున్న DMK, AIADMKలు ఈసారి భారీగా స్థానాలను కోల్పోయాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గం కొలత్తూర్‌లో ఓటమి పాలుకావడం గమనార్హం. డీఎంకే 59, అన్నా డీఎంకే 47 స్థానాలు గెలుచుకున్నాయి. ఒకవేళ ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే.. వీటి సంఖ్య 106 కు చేరుకుంటుంది. ఈ పార్టీలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే.. మరో 12 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది.

Tamil Nadu Hung Assembly | చిన్న పార్టీల సభ్యులకు డిమాండ్​..

ప్రభుత్వం ఏర్పాటుకు ఓ వైపు కాంగ్రెస్​తో కలిసి టీవీకే ఏర్పాట్లు చేసుకుంటోంది. మరోవైపు డీఎంకే – అన్నా డీఎంకే పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రచారంలో జరుగుతోంది. ఈ కూటమిలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే చిన్న పార్టీ ఎమ్మెల్యేల మద్దతు చాలా అవసరం. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు ఎమ్మెల్యేలతోపాటు ఇతర పార్టీల శాసన సభ్యులకు డిమాండ్​ ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పాటుకు ఏ ఒక్క సభ్యుడిని కూడా జారవిడుచుకునే పరిస్థితి లేకుండా పోయింది.

Vijay Oath Taking | రేపే విజ‌య్ ప్ర‌మాణ స్వీకారం.. మెజారిటీ కోసం క‌స‌ర‌త్తు, మ‌ద్ధ‌తుపై కొన‌సాగుతున్న స‌స్పెన్స్

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *