Jr NTR Birthday | అంబ‌రాన్నంటిన ఎన్టీఆర్ బర్త్‌డే సంబరాలు.. అర్ధ‌రాత్రి జూనియ‌ర్ ఇంటి వ‌ద్ద సందడి..!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Jr NTR Birthday | యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఈసారి ఘనంగా జరిగాయి. అభిమానుల సందడి, కొత్త సినిమా అప్‌డేట్‌లు, సోషల్ మీడియాలో (Social Media) ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లతో తారక్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. మే 19 అర్ధరాత్రి 12 గంటలు దాటగానే హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ నివాసం వద్ద అభిమానుల సందడి పీక్స్‌కు చేరుకుంది.

తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాది మంది అభిమానులు తరలివచ్చి తమ అభిమాన హీరోకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.‘జై ఎన్టీఆర్’, ‘హ్యాపీ బర్త్‌డే తారక్’ అంటూ నినాదాలతో పరిసరాలు మార్మోగిపోయాయి. అభిమానులు బాణసంచా కాలుస్తూ, కేక్ కటింగ్‌లు చేస్తూ పండగ వాతావరణాన్ని సృష్టించారు.

Jr NTR Birthday | అభిమానుల‌కి అభివాదం చేసిన తార‌క్..

అభిమానుల ప్రేమకు స్పందించిన తారక్ (Jr NTR) స్వయంగా ఇంటి బయటకు వచ్చి వారికి అభివాదం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చేతులు ఊపుతూ అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన ఆయనను చూసి అభిమానులు మరింత ఉత్సాహం పెరిగింది. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అభిమానులకు బర్త్‌డే కానుకగా ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘డ్రాగన్’ నుంచి మేకర్స్ ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేశారు. స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ (Director Prashanth Neel) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తోంది. విడుదలైన గ్లింప్స్‌లో ఎన్టీఆర్ పూర్తి భిన్నమైన మాస్ లుక్‌లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు.

Jr NTR Birthday | గ్లింప్స్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే

ఈ వీడియోలో తారక్ బరువు తగ్గి, రగ్గడ్ గడ్డం, వైల్డ్ హెయిర్ స్టైల్‌తో పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. దాదాపు నాలుగు నిమిషాల నిడివి గల ఈ గ్లింప్స్‌లో ఆయన చెప్పిన మాస్ డైలాగ్ అభిమానులకు ప్రత్యేక కిక్ ఇచ్చింది. సంగీత దర్శకుడు రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వీడియోకు మరింత ఎలివేషన్ తీసుకువచ్చింది. గ్లింప్స్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి చేరుకుంది. యూట్యూబ్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల్లో అభిమానులు వీడియోను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్, ఎన్టీఆర్ మాస్ అవతారం కలిసి ‘డ్రాగన్’ సినిమా (‘Dragon’ Movie)పై అంచనాలను మరింత పెంచేశాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా మారింది.

ఇది కూడా చదవండి..: NTR Dragon Glimpse | ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గర్జన మొదలు.. ఫస్ట్ గ్లింప్స్‌తో అంచనాలు పెంచేసిన‌ ప్రశాంత్ నీల్!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *